Pushpa2: ‘రంగస్థలం’లో పాము… ‘పుష్ప’లో గోరు.. లాజిక్‌ ఇదేనా?

  • September 13, 2023 / 05:04 PM IST

‘పుష్ప’ సినిమాను అనౌన్స్ చేసినప్పుడే అల్లు అర్జున్‌ ఆ సినిమా టైటిల్‌ను అనౌన్స్‌ చేశారు. అయితే అది ఇంగ్లిష్‌లోనే ఉన్నప్పటికీ.. అర్థంకాని ఫాంట్‌లో రాసుకొచ్చారు. దాంతో ఎవరూ దానిని గుర్తించలేదు. సినిమా టైటిల్‌ను ప్రకటించిన తర్వాత కానీ ఆ రోజు రాసింది పుష్పనా అనేది అర్థం కాలేదు. అది అల్లు అర్జున్‌ క్రియేటివిటీనా, లేక సుకుమార్‌దా అనేది తెలియలేదు. ఆ విషయం ఇప్పుడెందుకు అంటే.. ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమాకు సంబంధించి ఇలాంటిదే ఒకటి జరుగుతోంది. అప్పుడు పేరు అయితే… ఇప్పుడు గోరు అంటున్నారు.

అల్లు అర్జున్‌ – సుకుమార్‌ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప: ది రూల్‌’. 2021లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్‌’ సినిమాకు ఇది రెండో పార్టు అనే విషయం తెలిసిందే. తొలి భాగం భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ‘పుష్ప 2’ సినిమాను ఇంకాస్త మెరుగ్గా తీసుకొచ్చే పనిలో ఉన్నారు టీమ్‌. ఈ క్రమంలో సినిమాను 11 నెలల తర్వాత విడుదల చేస్తామని కూడా అనౌన్స్‌ చేశారు. అయితే సినిమా విషయాలను చెబుతున్న పోస్టర్లలో ఓ విషయం కామన్‌గా కనిపిస్తోంది. అదే చిటికెన వేలు గోరు. దీంతో ఎందుకు ఇలా అనే ప్రశ్న వస్తోంది.

రిలీజ్‌ డేట్ పోస్టర్‌లో అల్లు అర్జున్‌ చేతిని చూపిస్తూ, అందులో చిటికెన వేలు గోరును హైలైట్‌ చేశారు. కొన్ని రోజుల క్రితం ‘వేర్‌ ఈజ్‌ పుష్ప’ పేరుతో విడుదల చేసిన వీడియోలోనూ గోరును హైలైట్‌ చేశారు. అయితే అప్పట్లో గోరు గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో దీనిపైనే చర్చ. గోరును వెనుక ఓ పెద్ద థియరీ ఉందని చెబుతున్నారు. దీనికి సినిమా నాటి రోజులకు లింక్‌ ఉందని చెబుతున్నారు.

కొన్ని సంస్కృతుల్లో సంపదను, సమాజంలో స్థాయిని చూపించేందుకు చిటికెన వేలు గోరు పెంచుకుంటారని చెబుతారు. దాంతోపాటు తాము రూలర్‌ అనే విషయం చెప్పడానికి కూడా ఈ విధానాన్ని వాడతారట. అలా మరి సినిమాలో ‘పుష్ప’రాజ్‌ ఎర్ర చందనం వ్యాపారాన్ని రూల్‌ చేస్తాడు కాబట్టి ఆ గోరును అలా చూపించారు అని అంటున్నారు. అయితే ఈ సినిమాలో శ్రీవల్లి పాత్ర చనిపోతుందని, ఆమెకు గుర్తుగా గోరుకి రంగేసుకున్నాడనే వాదన కూడా వినిపిస్తోంది.

నిజానికి సుకుమార్‌ సినిమాల్లో చాలా షాట్లలో ఇలా రిఫరెన్స్‌లు ఇస్తూ ఉంటారు. ‘రంగస్థలం’ సినిమాలో జగపతిబాబు పాత్రకు పామును రిఫరెన్స్‌గా తీసుకున్నారు. పామును కొట్టి చంపే తరహాలోనే జగపతిబాబు పాత్రను ఆఖరున చిట్టిబాబు చంపుతాడు. ఇప్పుడు ఇదే స్టైల్‌లోనే (Pushpa2) ‘పుష్ప 2’లో కూడా గోరు ఉంటుంది అంటున్నారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus