Mahesh Babu: ఎన్నెన్నో రివ్యూలు ఇచ్చాడు మహేష్‌.. మరీ ఇంతలా దిగిపోవాలా?

సినిమా విడుదలవుతోంది అంటే అందరికీ గుర్తొచ్చేది రివ్యూ. సినిమా ఎలా ఉంది? ఎవరెలా నటించారు? ఎవరి పనితనం ఎలా ఉంది? ఫైనల్‌గా ఫలితం ఏంటి? అనే వివరాలు ఆ రివ్యూలో ఉంటాయి. అయితే ఇది సగటు సినిమా ప్రేక్షకుడు చూసే రివ్యూ. అయితే హార్డ్‌కోర్‌ సినిమా ఫ్యాన్స్‌ అయితే మాత్రం ఒకరి రివ్యూ కోసం ఎదురు చూస్తుంటారు. అంత పెద్ద రివ్యూయర్‌ ఎవరబ్బా అనుకుంటున్నారా? ఇంకెవరు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు. అయితే ఇదంతా గతం ‘మేమ్‌ ఫేమస్‌’ సినిమా వచ్చాక ఇది మారిపోయింది.

‘మేమ్‌ ఫేమస్‌’ సినిమాకు, మహేష్‌ రివ్యూ మీద నమ్మకానికి ఏం సంబంధం అంటారా? ఆ సినిమాకు మహేష్‌ ఇచ్చిన రివ్యూ ఢమాల్‌ అని ఫ్లాప్‌ అవ్వడమే. అవును.. ‘మేమ్‌ ఫేమస్‌’ రివ్యూ ఇచ్చిన మహేష్‌ సినిమా అద్భుతంగా ఉంది అంటూ తెగ మెచ్చేసుకున్నాడు. కొత్త వాళ్లు తీసిన సినిమా అని అస్సలు అనిపించలేదు అంటూ పొగిడేశాడు. కానీ సినిమా చూస్తే అస్సలు సరుకులేదు. దీంతో మహేష్‌ ఇలా చేశాడేంటి అని అందరూ అనుకోసాగారు.

నిజానికి మహేష్‌ నుండి ఇలాంటి రివ్యూ ట్వీట్‌ అస్సలు ఎక్స్‌పెక్ట్‌ చేయం. అగ్ర హీరోల సినిమాలు బాగోక పోతే ఆయన చూసి.. కామ్‌గా ఉంటాడు తప్ప ట్వీట్లు చేయడు. మొహమాటానికి కూడా ఆయన బాగుంది అనడు. అలాంటి మహేష్‌ ఇప్పుడు ‘మేమ్‌ ఫేమస్‌’ గురించి ఎందుకు ఇలా ట్వీట్‌ చేశాడు అనేదే ప్రశ్న. ‘మేమ్ ఫేమస్’ సినిమాను తోపు అంటూ ట్వీట్ రాగానే.. సినిమా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అనుకున్నారంతా. కానీ ఫలితం చూశాక మహేష్‌ మాటలు తుస్‌ మన్నాయి.

ఈ సినిమాకు మహేష్‌ (Mahesh Babu) ఇలా చేయడం వెనుక ఆ సినిమా నిర్మాతలతో అతనికున్న అనుబంధమే కారణం అని అంటున్నారు. ఆ సినిమాను తీసిన నిర్మాతలు గతంలో మహేష్‌ నిర్మాణ భాగస్వామిగా ఓ పెద్ద సినిమా చేశాయి. ఆ రిలేషన్‌తోనే మహేష్‌ ‘మేమ్‌ ఫేమస్‌’కి ట్వీట్‌ చేశాడు. అయితే సినిమా బాగుంది అని కాకుండా.. విషెష్‌ చెప్పి చేసుంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు అని ఇప్పుడు అభిమానులు అంటున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus