‘సైరా’ ఈవెంట్ కు నయన్ అందుకే రాలేదట…!

తాజాగా ముంబైలో జరిగిన సైరా నరసింహారెడ్డి ప్రెస్ మీట్లో అమితాబ్ బచ్చన్, నయనతార మిస్సైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరివీ అత్యంత కీలక పాత్రలే. అమితాబ్ ఆబ్సెన్స్ ను పెద్దగా పట్టించుకోలేదు ప్రేక్షకులు. ఎందుకంటే ఆయన ఇప్పుడు మిస్సయినా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కు కచ్చితంగా వస్తారనేది వారి నమ్మకం. అమితాబ్, మెగాస్టార్ల మధ్య ఉన్న అనుబంధం అలాంటిది. కానీ నయన్ హాజరుకాకపోవడం పై మెగా అభిమానులే కాదు… తెలుగు ప్రేక్షకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు .

సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్లు వచ్చినప్పుడు నయన్ రావడానికేమైందని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ నయనతారను అంతగా తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకూ నయన్ చేసిన సినిమాల ప్రమోషన్ కు హాజరైంది లేదు. హీరో ఇమేజ్ ఎలాంటిదైనా సరే ఆమె మాత్రం ప్రమోషన్లకు రానని ప్రతీ ప్రాజెక్ట్ సైన్ చేసే సమయంలోనే నయనతార స్పష్టంగా చెప్పేస్తుందట. అందులోనూ ఇప్పుడు నయనతార విజయ్ ‘బిజిల్’ రజనీకాంత్ ‘దర్బార్’ చిత్రాల షూటింగ్ లతో బిజీగా ఉంది. కాబట్టి నయన్ తప్పేమీ లేదని చెన్నై మీడియా వర్గాల సమాచారం. ఒకవేళ చెన్నైలో ‘సైరా’ ఈవెంట్ ఏదైనా నిర్వహిస్తే.. దానికి కచ్చితంగా నయనతార హాజరయ్యే అవకాశం ఉందట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus