టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల ప్రెస్‌మీట్లు, ఇంటర్వ్యూలు ఇక ఉండవా?

సినిమా ప్రచారం అంటే గతంలో ముఖ్యంగా వినిపించేది ఇంటర్వ్యూ. సినిమాలోని ముఖ్య నటీనటుల ఇంటర్వ్యూలు పెద్ద ఎత్తున చేసేవారు. రిపోర్టర్లు ప్రశ్నలు అడగడడం, వాటికి సినిమా వాళ్లు సమాధానాలు చెప్పడం మీరు చాలా ఏళ్లుగా చూస్తూనే ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ప్రెస్‌మీట్లు, ఆడియో రిలీజ్‌ ఈవెంట్లు, ప్రీరిలీజ్‌ ఈవెంట్లు అంటూ చాఆలనే ఉండేవి. అయితే రీసెంట్‌ టైమ్స్‌లో పద్ధతి మొత్తం మారిపోయింది. ఇంటర్వ్యూలు అనేవే కనిపించడం లేదు.

అదేంటి, యూట్యూబ్‌లో, సోషల్‌ మీడియాలో చాలా ఇంటర్వ్యూలు కనిపిస్తున్నాయి కదా అంటారా? అవును ఆ వీడియోలు కనిపిస్తున్నాయి. అయితే అవి ఇంటర్వ్యూయర్‌ లేని ఇంటర్వ్యూలు అని మాట. అంటే అడిగేవాళ్లు సొంతవాళ్లు అన్నమాట. సినిమా టీమ్‌ నుండి ఒక వ్యక్తో, తెలిసిన మరో సినిమా వ్యక్తో. లేక యాంకరో ప్రశ్నలు అడుగుతారు. వాళ్లకు ప్రశ్నలు చాలావరకు ముందుగా రాసిచ్చేవే.

అలా అని అన్ని సినిమాలకూ పరిస్థితి ఇలానే ఉంది అని అనుకోకండి. పెద్ద హీరోల సినిమాలకే ఈ పరిస్థితి. ఇప్పుడు సంక్రాంతి సీజనే తీసుకోండి. మూడు పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఒక్క హీరో అయినా ఇంటర్వ్యూ ఇచ్చారా? సినిమాలోని హీరోయిన్లు, సీనియర్‌ యాక్టర్లే మాట్లాడుతున్నారు. హీరోలు రికార్డింగ్‌ ఇంటర్వ్యూలు చేసి పంపిస్తున్నారు. అలా ‘డాకు మహారాజ్‌’, ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రచారాన్ని పూర్తి చేసేశాయి.

ఇదంతా చూస్తుంటే పెద్ద హీరోల సినిమాలకు ఇక హీరోలు ముందుకొచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చే పరిస్థితి మనం ఇక చూడలేం. ఏదన్నా జరిగితే అందరినీ ఓ గదిలో పడేసి గంపగుత్తగా ప్రశ్నలు అడిగించేస్తారు. హీరోలకు మీడియా ముందుకు రావడానికి ఏం ఇబ్బందో అర్థం కావడం లేదు. అయితే, ఈ హీరోలే నార్త్‌ రాష్ట్రాలకు వెళ్లి ఎఫ్‌ఎంల్లో కూడా కూర్చుని మాట్లాడి వస్తున్నారు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఎందుకో కానీ మాట్లాడారు. ఇదంతా చూస్తుంటే హీరోలు అందులోనూ పెద్ద హీరోలు ఇంటర్వ్యూలు ఇచ్చే రోజులు అయిపోయాయేమో అనిపిస్తోంది.

సంక్రాంతి బాక్సాఫీస్.. టోటల్ బిజినెస్ ఏ రేంజ్‌లో ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus