సంక్రాంతి బాక్సాఫీస్.. టోటల్ బిజినెస్ ఏ రేంజ్‌లో ఉందంటే?

2025 సంక్రాంతి సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్‌కి హై లెవెల్‌ను అందించనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సీజన్‌లో ‘గేమ్ చేంజర్,’ ‘డాకు మహారాజ్,’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూడు భారీ ప్రాజెక్టులు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగడంతో థియేటర్లలో స్పెషల్ ఫెస్టివల్ మూడ్ నెలకొంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ మూడు సినిమాలు కలిపి దాదాపు రూ. 250 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను నమోదు చేశాయి. ఇందులో ‘గేమ్ చేంజర్’ 130 కోట్ల థియేట్రికల్ రైట్స్ అమ్ముడై టాప్ స్థానంలో నిలిచింది. శంకర్ దర్శకత్వం, రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్ ఈ సినిమాకి అదనపు బలంగా నిలుస్తున్నాయి. మరోవైపు, నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ 90 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయగా, వెంకటేష్ సినిమా 30 కోట్ల మేర బిజినెస్‌ను ముగించినట్లు సమాచారం.

ఈ మూడు సినిమాల విజయానికి పాజిటివ్ మౌత్ టాక్ కీలకం. ఫ్యామిలీ ఆడియన్స్‌ను లక్ష్యంగా తీసుకున్న వెంకటేష్ సినిమా బడ్జెట్ తక్కువగా ఉండటంతో పెట్టుబడులు త్వరగా రికవర్ అవుతాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. బాలయ్య సినిమా విషయంలో అభిమానుల మద్దతు బలంగా ఉన్నప్పటికీ, మాస్ అండతోనే బాక్సాఫీస్ వద్ద నిలవాలి.

‘గేమ్ చేంజర్’ భారీ స్థాయి ప్రాజెక్ట్ కావడంతో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రావడం ఖాయమని భావిస్తున్నారు. అయితే టికెట్ ధరలపై వివాదాలు, భారీ అంచనాలు ఈ సినిమా మీద ప్రభావం చూపుతాయేమోనన్న ఆందోళన కూడా ఉంది. ‘డాకు మహారాజ్’ ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకోగా, ప్రమోషన్ తక్కువగా ఉన్నందున ప్రేక్షకుల హైప్ తగ్గినట్లు తెలుస్తోంది. ఈ మూడు సినిమాలు సంక్రాంతి సీజన్‌ను హీట్ పెంచడంతో టాలీవుడ్‌లో లాభాల పంట పండించనున్నాయి. మొత్తం మీద, సంక్రాంతి బాక్సాఫీస్ రేస్‌లో ఎవరు దూసుకుపోతారన్నది ఆసక్తికరంగా మారింది.

గేమ్ ఛేంజర్ థియేటర్ కౌంట్.. దేవర కంటే తక్కువే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus