కరోనా సెకండ్ వేవ్ సామాన్య ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసిన సంగతి తెలిసిందే. వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. సోనూసూద్ దేశవ్యాప్తంగా ప్రజల కష్టాలను తెలుసుకుంటూ సహాయం చేస్తుంటే స్టార్ హీరో చిరంజీవి తన వంతు సహాయం చేసి సేవాగుణాన్ని చాటుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని చిరంజీవి నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ కొరత వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోకూడదని భావించి త్వరలో ఆక్సిజన్ ప్లాంట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా చిరంజీవి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు.
కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పలువురు నటులకు చిరంజీవి ఇప్పటికే సాయం చేశారు. తాజాగా చిరంజీవి అనారోగ్యంతో బాధ పడుతున్న భరత్ భూషణ్ అనే ఫోటో జర్నలిస్టుకు 50వేల రూపాయల సాయం అందించారు. చిరంజీవితో పాటు పలువురు సినీ నటులు తమ వంతు సహాయం చేస్తున్నా కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న కొందరు సినీ నటులు మాత్రం ప్రజలకు మొహం చాటేస్తున్నారు. దీంతో ఈ స్టార్ హీరోలకు సేవాగుణం లేదా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సినిమాసినిమాకు రికార్డు స్థాయిలో పారితోషికం పెంచుతున్న హీరోలు ప్రజలకు సాయం చేసే విషయంలో మాత్రం ముందుకు రాకపోవడం గమనార్హం.
సుకుమార్, నిఖిల్, మరి కొందరు సెలబ్రిటీలు సాయం చేస్తున్నా మిగతా సెలబ్రిటీలు కూడా ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. తాము రీల్ హీరోలం కాదని రియల్ హీరోలమని స్టార్ హీరోలు ప్రూవ్ చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!