టాలీవుడ్‌లో కొన్నేళ్లు పని చేసిన హీరోయిన్ బాలీవుడ్‌కి వెళ్తే మనం గొప్పగానే చెప్పుకుంటాం. మన హీరోయిన్ అక్కడ కూడా అదరగొడుతోంది అని ఆనందపడతాం. తిరిగి టాలీవుడ్‌కి రాకపోతే ఇలియానాను తిట్టుకున్నట్లు తిట్టుకుంటాం. ఒక్క సినిమాతో తిరిగి వచ్చేస్తే త్రిషను పొగిడినట్లు పొగిడేస్తాం. అయితే బాలీవుడ్‌కి వెళ్లిన హీరోలను పొగిడే అవకాశం, ఏదైనా మాట అనే అవకాశం రావడం లేదు. ఎందుకంటే అక్కడ వారికి విజయాలే రావడం లేదు. అన్నట్లు విజయాలు ఇవ్వడం లేదు అని కూడా అనొచ్చు.
‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్‌కి ఎన్టీఆర్ ఇటీవల వెళ్లాడు. సినిమా ఫలితం విషయం మనం కామెంట్ చేయకుండా ఎన్టీఆర్ పాత్రను చూపించిన విధానం, ఇంపార్టెన్స్ చూసుకుంటే ఎందుకు వెళ్లాడు తారక్ అక్కడికి. ట్రోల్ అవ్వడానికే వెళ్లినట్లు ఉన్నాడు అని కచ్చితంగా అనిపిస్తుంది. సినిమా భారీతనం, తీసిన విధానం.. ఇలా అన్నింటిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీ.. కానీ ఒక్క చూపించే విధానంలోనే ఇబ్బందిపడ్డారు. ఆ మాటకొస్తే వీళ్లే కాదు గతంలో చాలామంది స్టార్ హీరోల అభిమానులు ఇలాంటి పరిస్థితి ఫేస్ చేశారు.
స్టార్ హీరోలుగా ఉండి స్ట్రెయిట్‌గా హిందీ సినిమాలు చేయడం ఎప్పుడూ తెలుగు నటులకు కలిసి రాలేదు. ఈ తరం హీరోల్లో ఈ పొరపాటు ప్రయత్నం చేసి తొలి హీరో రామ్ చరణ్. ‘తుఫాన్’ అంటూ ‘జంజీర్’ సినిమాను రీమక్ చేసి చేతులు కాల్చుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు పాన్ ఇండియా స్టార్ అయ్యాక ‘ఆదిపురుష్’ అంటూ ప్రభాస్ ఇబ్బందికర ఫలితం అందుకున్నాడు. ఇక్కడ బ్లాక్‌బస్టర్ అయిన ‘ఛత్రపతి’ని బాలీవుడ్‌కి తీసుకెళ్లి చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు గట్టి దెబ్బే పడింది.
అయితే ఒక్క సీనియర్ స్టార్ హీరోలు దీనికి మినహాయింపు. ‘ప్రతిబంద్’, ‘ఆజ్ కా గూండారాజ్’ లాంటి హిట్లు అందుకున్న ఆయన.. ‘ది జెంటిల్‌మెన్’ ఫలితం చూశాక మళ్లీ బాలీవుడ్‌వైపు చూడలేదు. ‘శివ’ సినిమా మంచి ఫలితం ఇవ్వడంతో ‘ద్రోహి’ అనే సినిమా చేశారు నాగార్జున. ఆ సినిమా ఫలితం చాలా ఏళ్లు అటు వెళ్లలేదు. ఇటీవల ‘బ్రహ్మాస్త్ర’ చేశారు. వెంకటేశ్‌కీ ఇలాంటి ఫలితమే. ‘ఆనారి’ సినిమా ఫలితం చూసి ‘తక్‌దీర్‌వాలా’ చేశాడు. అది ఇబ్బంది పెట్టడంతో మళ్లీ అటు చూడలేదు.