నందమూరి బాలకృష్ణ ఇటీవల అసెంబ్లీలో చేసిన రచ్చ తెలిసిందే కదా. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ టికెట్ రేట్ల విషయంలో చేసిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ.. టాలీవుడ్ పెద్దలపై ముఖ్యంగా చిరంజీవిపై ఆయన పరోక్షంగా నెగిటివ్ కామెంట్స్ చేశారు.వీటికి చిరంజీవి రియాక్ట్ అయ్యి.. బాలకృష్ణ అలా అనడం సరికాదు అన్నట్టు ఓ ఎమోషనల్ లెటర్ రిలీజ్ చేశారు. అంతేకాదు అఖిల భారత చిరంజీవి యువసేన మొత్తం రంగంలోకి దిగి బాలకృష్ణకి వ్యతిరేకంగా నిరసన చేసి చిరంజీవి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
బాలకృష్ణ అలాంటివి వాటికి లొంగి దిగొచ్చే రకం కాదు. ఎవరైనా సర్ది చెబితే వినే రకం అస్సలు కాదు. అది చిరంజీవి అభిమానులకు కూడా బాగా తెలుసు. అందుకే వాళ్ళు సైలెంట్ అయిపోయారు. కాకపోతే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ గా ఉండిపోయారు? అనేది చాలా మందికి అర్థం కాలేదు. చిరంజీవితో దణ్ణం పెట్టించుకోవడాన్ని పవన్ కళ్యాణ్ సహించలేకపోయారు.
తన అన్నతో నమస్కారం పెట్టించుకుని స్థాయి జగన్ కి లేదు అన్నట్టు చాలా సందర్భాల్లో పవన్ విరుచుకుపడ్డారు. మరి బాలయ్య విషయంలో చిరంజీవి హర్ట్ అయ్యి ఎమోషనల్ లెటర్ రిలీజ్ చేస్తే పవన్ దీని గురించి స్పందించలేదు. కూటమి ఎమ్మెల్యే కదా అని బాలయ్య విషయంలో లైట్ తీసుకున్నాడా? అనే విమర్శలు వచ్చినా పవన్ సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు.
వాస్తవానికి చిరంజీవి అలా ఎమోషనల్ లెటర్ రిలీజ్ చేయడం అనేది పవన్ కళ్యాణ్ కి కూడా ఇష్టం లేదు. చిరు స్థాయి తగ్గించుకుని మళ్ళీ జగన్ కి వత్తాసు పలికినట్టు అయ్యింది. అందుకే పవన్ కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకున్నట్లు సమాచారం. లేదు అంటే పవన్ కూడా తగ్గే రకం కాదు.