రాజమౌళి సినిమా చాలా బలంగా ఉంటుంది. కథ, కథనం, కాస్టింగ్, విజువల్ ఎఫెక్ట్స్, ప్రచారం… ఇలా అన్ని చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అందుకే ఆయన సినిమా రిలీజ్ టైమ్‌లో పోటీ పడటానికి ఎవరూ ముందుకు రారు. తనకు తాను మాత్రమే పోటీ అంటూ… సినిమా తెరకెక్కించి, థియేటర్లకు పంపించి విజయాలు సాధిస్తుంటారాయన. అలాంటి రాజమౌళి నుండి జనవరి 7న ‘ఆర్‌ఆర్‌ఆర్’ వస్తోంది. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి పవన్ కల్యాణ్‌ను కలుస్తున్నారు అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
ఇలా ఎందుకు కలుస్తున్నారు అనేది ముందు చూసి… తర్వాత ఆ అవసరం అసలు ఉందా అనేది చూద్దాం. 2022 సంక్రాంతి సీజన్‌ను జనవరి 12న ‘భీమ్లా నాయక్’తో పవన్ కల్యాణ్ మొదలు పెడతారని ప్రకటన వచ్చింది. అయితే కొన్ని కారణాలు, మార్పుల వల్ల ‘ఆర్‌ఆర్ఆర్’ను జనవరి 7న తీసుకొస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ను ఏప్రిల్ 1కి తీసుకెళ్లిపోయారు. ‘రాధే శ్యామ్’ కూడా ఇలానే వాయిదా వేస్తారని అనుకున్నా. 14న ఫిక్స్ అని ప్రభాస్ టీమ్ చెప్పేసింది.
ఇక ‘భీమ్లా నాయక్’ మార్చికి అనుకున్నారు. కానీ నేను వెళ్లడం లేదంటూ సేమ్ డేట్ ఫిక్స్ చేశాడు పవన్. దీంతో టాలీవుడ్‌లో సమస్య వచ్చి పడింది. పెద్ద సినిమాలు దగ్గర దగ్గర విడుదల చేస్తే… వసూళ్ల విషయంలో ఇబ్బంది వస్తుందని అందరూ అనుకోవడం ప్రారంభించారు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ వాయిదా కష్టం. ఒకవేళ వేస్తే భారీ లాస్ పక్కా. ‘రాధే శ్యామ్’ పరిస్థితీ ఇదే. దీంతో ‘భీమ్లా నాయక్’ మాత్రమే కదపాలి. కానీ ఈ విషయంలో పవన్ చాలా పక్కాగా ఉన్నారట.
తను పరిశ్రమ గురించి ఆలోచించి ప్రభుత్వంతో పోరాడితే… ఎవరూ ముందుకు రాలేదనేది ఆయన బాధ అని కూడా వార్తలొచ్చాయి. మరోవైపు తన సినిమా సోలోగా వస్తే ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు ఉంటుందని పవన్ ఇలా రెండు సినిమాల మధ్య వస్తున్నాడని కూడా వార్తలొచ్చాయి. ఇదీ ఇప్పటివరకు జరిగింది. అయితే వీటన్నింటి విషయం తేల్చడానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్ పవన్‌తో జరిపిన చర్చలు విఫలమయ్యాయట. దీంతో రంగంలోకి రాజమౌళి దిగాల్సి వచ్చిందట. విషయాన్ని మరోసారి పవన్‌కు వివరించి, సినిమాల మధ్య గ్యాప్ ఎందుకు ఉండాలో చెప్పాలని జక్కన్న అనుకుంటున్నాడట.
అయితే ఇక్కడే ప్రశ్న వస్తోంది. రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి సినిమాను పెట్టుకుని మిగిలిన హీరోల సినిమాల గురించి ఎందుకు ఆలోచించడం అనేదే ప్రశ్న. తన సినిమాలో సత్తా చూసి జనాలే వస్తారు కదా అని అనుకోకుండా ఎందుకు పవన్‌తో మాట్లాడుతున్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు. దీనికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. సినిమాలో ఎంత సత్తా ఉన్నా… అవతల ఇమేజ్ అలాంటిది కాబట్టే జక్కన్న ఇలా సయోధ్య ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్. దాంతోపాటు టాలీవుడ్‌లో లేనిపోని పొరపొచ్చాలకు తావు ఇవ్వకుండా ఈ ప్రయత్నం అని టాక్.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!