Ravi Teja: స్టార్ డైరెక్టర్లకు రవితేజ దూరం.. ఎందుకని?

ఒకప్పుడు రవితేజ సినిమాలు అంటే మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం బయ్యర్స్ కి కానీ, నిర్మాతలకు కానీ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే.. గతంలో రవితేజతో సినిమా అంటే అతనికి రూ.2 కోట్లు, రూ.3 కోట్లు పారితోషికంగా ఇస్తే సరిపోయేది. కొంచెం లెక్కలు పెరిగినప్పటికీ లెక్క రూ.5 కోట్లు, రూ.6 కోట్ల వద్దే ఉండేది.’క్రాక్’ సినిమాకి రవితేజ తీసుకుంది రూ.6 కోట్లే. అందరికీ అందుబాటులో ఉండే హీరో అనే ముద్ర రవితేజపై ఉండేది.

Ravi Teja

కానీ తర్వాత అతను సినిమా సినిమాకు పారితోషికం పెంచుకుంటూ పోయాడు. ఇప్పుడు అది రూ.25 కోట్లు, రూ.30 కోట్లకు చేరింది. అతని పారితోషికమే రూ.30 కోట్లు పోతే.. ఇక సినిమాకి ఎంత అవుతుంది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే రవితేజ సినిమాలకి బిజినెస్ అవ్వడం కూడా కష్టంగా మారింది. పోనీ పెద్ద దర్శకులు చెప్పే కథలకు రవితేజ ఏమైనా ఓకే చెబుతాడా? అంటే అదీ లేదు.

దాదాపు రూ.100 కోట్లు బడ్జెట్ ఇమేజ్ లేని లేదా ఫామ్లో లేని దర్శకులపై నిర్మాతలు ఎలా పెడతారు. ‘మాస్ జాతర’ దర్శకుడు కొత్తోడే. రవితేజ నెక్స్ట్ సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ దర్శకుడు కిషోర్ తిరుమల అయితే ప్రస్తుతం ఫామ్లో లేడు. అయినా ఈ సినిమాల బడ్జెట్లు రూ.80 కోట్ల నుండి రూ.100 కోట్లకు వెళ్లాయి. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎందుకంటే కాంబినేషన్ క్రేజ్ లేదు. రవితేజ వంటి హీరో ఏ సురేందర్ రెడ్డి వంటి స్టార్ దర్శకులతో సినిమాలు చేస్తేనే.. వాటికి బజ్ ఉంటుంది. లేకపోతే ఇలానే ఉంటుంది.

యంగ్ హీరోలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్న హీరోయిన్

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus