సమంత విషయంలో గత కొన్నేళ్లుగా చాలా రకాల వార్తలు వస్తున్నాయి. తొలుత ఆమె వైవాహిక జీవితం నుండి పుకార్లు మొదలయ్యాయి. ఎవరు స్టార్ట్ చేశారు, ఎక్కడి నుండి తొలి పుకారు వచ్చింది అనే విషయం పక్కనపెడితే.. పుకార్లు అయితే గత కొన్నేళ్లుగా వస్తూనే ఉన్నాయి. వాటిలో ఎన్నింటికి సమంత స్పందించింది, ఎన్నింటికి సమాధానం చెప్పింది, ఎంత క్లారిటీ వచ్చింది అంటే చాలా తక్కువే అని చెప్పాలి. అలాంటి సమంత ఇప్పుడు రూ. 25 కోట్ల పుకార్లపై ఎందుకు అంత అర్జెంట్‌గా స్పందించింది అనేది ఇక్కడ ప్రశ్న.
అసలు ఏమైందో ముందు చూద్దాం. ఆ తర్వాత చర్చల గురించి చూద్దాం. స్టార్ హీరోయిన్ సమంత గత కొన్ని నెలలుగా మయోసైటిస్ అనే రుగ్మతతో బాధపడిన విషయం తెలిసిందే. రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపించే వ్యాధికి ఆమె చికిత్స తీసుకుని ప్రస్తుతం కోలుకున్నారు. ఇప్పుడు మరింత కోలుకోవడానికి తిరిగి సినిమాల నుండి గ్యాప్ తీసుకున్నారు. అయితే ఎక్కడి నుండి వచ్చిందో ఏమో… ఇటీవల ఓ పుకారు దుమారం రేపింది. అదే టాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరో దగ్గర నుండి రూ.25 కోట్లు తీసుకున్నారనేది ఆ పుకారు సారాంశం.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ రూమర్స్‌పై (Samantha) సమంత స్పందించింది. ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా వివరణ ఇచ్చింది. ‘మయోసైటిస్ చికిత్సకు రూ.25 కోట్లా? ఎవరో మీకు తప్పుగా చెప్పారు. మీరు చెప్పిన దాంట్లో తక్కువ మొత్తాన్నే ఖర్చు చేస్తున్నాను. ఇప్పటివరకూ నాకు పారితోషికంగా మార్బుల్స్ ఇచ్చారని అనుకోవడం లేదు. చికిత్సకు అవసరమైన డబ్బులు నేనే అరేంజ్ చేసుకోగలను’’ అంటూ కాస్త ఘాటుగానే రాసుకొచ్చింది సమంత.
అయితే… వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో పుకార్లు వచ్చినప్పుడు స్పందించని సమంత… ఇప్పుడు రూ. 25 కోట్ల పుకార్లు గురించి ఎందుకు అంత అర్జెంట్‌గా రియాక్ట్ అయ్యిందో అర్థం కావడం లేదు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చూద్దాం దీని గురించి కూడా ఏమైనా రియాక్ట్ అవుతుందేమో.