SKN: దీపిక vs రష్మిక.. స్టార్‌ వార్‌ క్రియేట్‌ చేసిన ప్రొడ్యూసర్‌.. ఇప్పుడు అవసరమా?

‘స్పిరిట్‌’, ‘కల్కి 2’ సినిమాల నుండి దీపికా పడుకొణె తప్పుకోవడం / తప్పించడం తర్వాత చాలా రకాల చర్చలు మొదలయ్యాయి. ఆమె పారితోషికంతోపాటు లాభాల్లో వాటా అడుగుతోందని, రోజుకు ఇన్ని గంటలే పని చేస్తానని చెబుతోంది అనేవి ఆమె మీద వచ్చిన ప్రధానమైన విమర్శలు. వీటిలో ఏది నిజం, ఎంతవరకు నిజం అనే విషయంలో ఇరువర్గాలు ఓపెన్‌ కాకపోయినా.. ‘నిబద్ధత’ అనే పదాన్ని వైజయంతీ మూవీస్‌ హైలైట్‌ చేయగా, పని గంటలు అనే విషయాన్ని సందీప్‌ రెడ్డి వంగా ఎక్కువగా చెబుతున్నారు అని టాక్‌. వాటికి దీపిక ఆన్సర్‌ కూడా ఇచ్చేసింది.

SKN

అయితే, ఇప్పుడు మరోసారి ఈ విషయం చర్చకు వచ్చింది. ఈసారి కారణం దీపికా పడుకొణె కాదు, నిర్మాతలు కాదు. ఈ రెండు వర్గాలకు ఎలాంటి సంబంధం లేని మరో సినిమా నిర్మాత ఎస్‌కేఎన్‌. ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమా ప్రచారంలో భాగంగా ఇటీవల నిర్వహించిన ఓ మీడియా కార్యక్రమంలో ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ ‘సినిమా మీద ప్యాషన్‌తో రోజులో ఎన్ని గంటలు పని చేయాలన్నా రష్మిక ఓకే చెబుతుంది’ అని అన్నారు. దీంతో ఆయన మాటల్ని దీపికకు రిలేట్‌ చేస్తున్నారు నెటిజన్లు.

ఇక్కడ ఎస్కేఎన్‌ దీపికను రిలేట్‌ చేస్తూ ఆ మాట అన్నారా? లేక ఏదో రష్మిక ఇమేజ్‌ని బిల్డ్‌ చేద్దామని ఆ మాట అన్నారా అనేది ఆయనే తెలియాలి. ఒకే రిలేట్‌ చేస్తూ అనున్నట్లయితే అల్లు అర్జున్‌ ఎంపికను తప్పు పట్టినట్లే అవుతుంది. అంటే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ చేస్తున్న సినిమాలో దీపికనే హీరోయిన్‌. మరి తన హీరో సినిమాలోని హీరోయిన్‌ను ఇన్‌డైరెక్ట్‌గా బన్నీ కామెంట్‌ చేస్తారా అనేది తెలుసుకోవాలి.

ఆ విషయం పక్కన పెడితే పెళ్లయి, ఓ పాపను చూసుకోవాల్సిన బాధ్యత ఉన్న హీరోయిన్‌ని పెళ్లి కాని యంగ్‌ హీరోయిన్‌తో పోల్చడం సరికాదు. ఎందుకంటే ఎవరి బాధ్యతలు వారివి. కాబట్టి ఎస్కేఎన్‌ మాటలు లేనిపోని ఫ్యాన్‌ వారికి రీజన్‌ అవుతున్నాయి. అయితే ఆయన దీపికను ఇన్‌డైరెక్ట్‌గా టీజ్‌ చేసి ఉంటేనే. ఎలా అన్నారు అనేది ఆయనే చెప్పాలి.

‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus