థియేటర్లు – ఓటీటీ… ప్రస్తుతం టాలీవుడ్ ఈ చర్చే నడుస్తోంది. సినిమాలను ఓటీటీలకు ఇవ్వొద్దు అంటూ థియేటర్లు, ప్రదర్శనకారులు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. ‘నారప్ప’ ఓటీటీ విడుదల ప్రకటించినప్పటి నుండే ఇది మొదలైంది అని చెప్పొచ్చు. ఆ సమయంలో నిర్మాత సురేశ్‌బాబును టార్గెట్ చేస్తూ చాలామంది విమర్శలు చేశారు. వీటికి సురేశ్‌బాబు వెనక్కి తగ్గారా… అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. ‘నారప్ప’ ఓటీటీ డీల్.. డబుల్ బొనాంజాలా కుదరింది.
అదే ‘నారప్ప’ + ‘దృశ్యం 2’. ఈ రెండు సినిమాలను సుమారు ₹70 కోట్లకు సురేశ్‌బాబు అమ్మేశారని అప్పుడు వార్తలొచ్చాయి. అందులో తొలుత ‘నారప్ప’ విడుదల చేసేశారు. తర్వాతి వరుసలో ‘దృశ్యం 2’ పెట్టారు. అయితే ‘నారప్ప’ వచ్చి చాలా రోజులవుతోంది కానీ ‘దృశ్యం 2’ రాలేదు. ఎందుకా అని ఆరా తీస్తే… సురేశ్‌బాబు వెనక్కి తగ్గారనే మాట వినిపిస్తోంది. అంటే ఓటీటీ విడుదల విరమించుకున్నారని కాదు. థియేటర్ల యజమానులు,
ప్రదర్శనకారుల ఆగ్రహం ఇటీవల పెరిగిన నేపథ్యంలో ‘దృశ్యం 2’ విడుదల తేదీ ప్రకటిస్తే… ఆ కోపం ఎక్కువవుతుందని ఆయన అనుకుంటున్నారట. దీంతో కాస్త గ్యాప్ ఇచ్చి అక్టోబరులో ఆ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారట. ఈలోపు హాట్‌స్టార్ కొనుక్కున్న మిగిలిన సినిమాలు విడుదల అవుతాయట. ‘టక్ జగదీష్’, ‘మాస్ట్రో’ సినిమాలను కూడా హాట్ స్టార్ కొనుగోలు చేసిందంటున్నారు.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!