సినిమా ఎలా తీశాం అనేది కాదు, ఎలా ప్రమోట్ చేశాం అనేది ప్రస్తుతం కీలకాంశం అయిపోయింది. అందుకే.. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకొని రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ వరకూ చాలా ప్లానింగ్ తో చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడానికే వారం ముందు ఎనౌన్స్ మెంట్ చేయడం, సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేయడం కామన్ అయిపోయింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ ఫార్మాట్ ను ఫాలో అవుతున్నారు. ఇక సినిమా ప్రమోషన్ 7 మార్కెటింగ్ లో సిద్ధహస్తుడు అయిన సురేష్ బాబు అయితే ఎప్పటికప్పుడు నయా ప్రొడ్యూసర్స్ కంటే అప్డేట్ అవుతూ తన ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే సినిమాల విషయంలో విశేషమైన జాగ్రత్తలు తీసుకొంటుంటారు.
అలాంటి సురేష్ బాబు చాలా కాలం తర్వాత స్వయంగా నిర్మించిన “ఈ నగరానికి ఏమయ్యింది” విషయంలో తన స్ట్రాటజీస్ ఏమీ ఫాలో అవ్వకుండా చాలా సింపుల్ గా రిలీజ్ చేసేస్తున్నారు. “పెళ్ళిచూపులు” ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నటించినవాళ్ళందరూ ఆల్మోస్ట్ కొత్తవాళ్లే. ట్రైలర్ & పోస్టర్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి కూడా. కానీ.. సడన్ గా సినిమాని జూన్ 29న విడుదల చేస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు సురేష్ బాబు. కనీసం రెండు వారాల గ్యాప్ కూడా లేకుండా ఇలా ఎనౌన్స్ చేయడం పట్ల షాక్ అవుతున్నారు ఇండస్ట్రీ వర్గాలు. కాన్ఫిడెన్స్ తో అలా చేస్తున్నారా లేక మరింకేదైనా కారణమా అని మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.