Ajith: అజిత్‌ సినిమా తెలుగు పేరుపై నెటిజన్ల పెదవి విరుపు!

  • January 5, 2022 / 05:46 PM IST

తెలుగు సినిమాలకు తెలుగులోనే పేరు పెట్టాలి అని అడిగే మనసులం మనం కాదు. ఆ సంగతి అందరికీ తెలిసిందే. మన సినిమావాళ్లకు ఈ విషయం బాగా అర్థమై… ఇంగ్లిష్‌ పేర్లను ఎక్కువగా పెట్టేస్తుంటారు. అయితే వాటిని తెలుగులో రాస్తారు. ఇంకొందరు అయితే పోస్టర్‌ మీద కూడా ఇంగ్లిష్‌లోనే పేర్లు పెడుతున్నారు. ఇదో రకం. ఇది కాకుండా వేరే రకం ఉన్నారు. వాళ్లు చాలా డిఫరెంట్‌. అయితే అవి డబ్బింగ్‌ సినిమాలు అవుతాయి.

లేదంటే రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కే సినిమాలు అవుతాయి. అలాంటి సినిమాతోనే ఇప్పుడు సమస్య వచ్చి పడింది. అది కూడా స్టార్‌ హీరో సినిమా. ఇప్పటికే అర్థమైపోయుంటుంది మేం ఏ సినిమా గురించి మాట్లాడుతున్నామో. ఆఁ.. అవును ‘వలిమై’ గురించే. తమిళ స్టార్‌ హీరో అజిత్‌ నటించిన ఈ సినిమాలో తెలుగు యువ కథానాయకుడు కార్తికేయ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ఈనెల 13న విడుదల చేస్తున్నారు. అయితే సినిమా విడుదల ఉండదు అనే పుకార్లూ వినిపిస్తున్నాయి.

ఆ విషయం పక్కనపెడితే… సినిమా తెలుగు పోస్టర్‌ లాంచ్‌ చేస్తాం అంటూ ఈ మధ్య ప్రకటించారు. తమిళంలో ‘వలిమై’ అంటే బలం, శక్తి అని అర్థం. దీంతో తెలుగులో ఏం పేరు పెడతారా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూడటం ప్రారంభించారు. అనుకున్న రోజు రానే వచ్చింది. సినిమా తెలుగు పోస్టర్‌ కూడా వచ్చింది. ఎంతో ఆశగా ఎదురుచూసిన వాళ్లకు నిరాశే ఎదురైంది. కారణం సినిమా పేరును తమిళంలో ఉన్నది కంటిన్యూ చేసేశారు.

ఇక్కడ కూడా ‘వలిమై’ అనే పేరు పెట్టారు. దీంతో ఈ సినిమాకు తెలుగు పేరు దొరకలేదా అంటూ చర్చ మొదలైంది. తమిళంలో సినిమా పేరు హీరో పేరే అయితే ఇలా కామన్‌ ఉంచేస్తే ఫర్వాలేదు. కానీ ఓ పదాన్ని అలా ఉంచేయడం ఇబ్బందిగా ఉంది. ‘సింగం’, ‘లింగ’ లాంటివి ఇలా ఉండిపోయినవే. తెలుగులో ఆ పదాలకు దగ్గర పదాలు ఉన్నాయి, అలానే అర్థాలు ఉన్నాయి. కానీ అర్థం లేని పదాన్ని తెలుగులో టైటిల్‌గా పెట్టడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus