సినిమాలను ఎలా సెన్సార్ చేస్తారు? సెన్సార్ వాళ్ల రూల్స్ ఏంటి? ఒక సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఎలా ఇష్యూ చేస్తారు? ఇలాంటి విషయాల గురించి మనం చర్చించలేం, చర్చిస్తే క్లారిటీ వచ్చేది ఉండదు కూడా. అయితే ఓ సినిమాకు సంబంధించి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి, మరొక సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి రూల్స్‌లో ఏమైనా మార్పులు ఉంటాయా? ఇదేం డౌట్ అనుకుంటున్నారా? ‘బేబీ’ సినిమా బయటకు వచ్చాక ఈ విషయంలో డౌట్ వస్తోంది అంటున్నారు నెటిజన్లు.
‘బేబీ’ సినిమా చూసినవాళ్లకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. లేదంటే సినిమా చూసినవాళ్లను అడిగితే.. ఈ విషయంలో మీకు కాస్త క్లారిటీ వస్తోంది. దీంతో సోషల్ మీడియాలో కామెంట్లు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో బూతులు విచ్చల విడిగా వాడేశారు. అమ్మాయిల్ని అసభ్యంగా తిట్టే ఓ తిట్టు అయితే ఈ సినిమాలో చాలాసార్లు వినిపించింది. కొన్నిచోట్ల ఆ తిట్టు సమయంలో బీప్ పడింది, మరికొన్ని చోట్ల అలా వదిలేశారు. అంతేకాదు కొన్ని పదాలు సెన్సార్ కత్తెరను దాటేసి వచ్చేశాయి.
అంతేకాదు లాంగ్ లిప్ లాక్‌ను యాజ్ ఇట్ ఈజ్ ఉంచేశారు. దానికి అత్యవసరం అనే ట్యాగ్ పెట్టారు అనే అనుకుందాం. అది పక్కనపెడితే.. కళ్లు – కాళ్లు అనే డైలాగ్ అయితే కాస్త అతి అయ్యిందనే చెప్పాలి. ఇక ఓవర్సీస్‌కి వెళ్లిన సినిమాలో అయితే ఇలాంటివి చాలానే ఉన్నాయి అంటున్నారు. వెబ్ సిరీస్‌ల కంటే కొంచెం ఎక్కువ డోసులోనే ఆ డైలాగ్‌లు ఉన్నాయి అంటున్నారు. దీంతో ఈ సినిమా విషయంలో సెన్సార్ ఇలా ఎలా వదిలేసింది అనే మాట వినిపిస్తోంది.
ఇక ఈ సినిమా (Baby Movie) విషయానికొస్తే.. ట్రయాంగిల్ హార్డ్ హిట్టింగ్ సినిమాగా రూపొందిన ‘బేబీ’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి టాక్ సంపాదించుకుంది. వసూళ్ల పరంగానూ సినిమాకు మంచి రిజల్టే కనిపిస్తోంది. విదేశాల్లోనూ సినిమాకు మంచి వసూళ్లే దక్కుతున్నాయి. వీకెండ్ పూర్తయ్యేసరికి వసూళ్ల లెక్క భారీగా ఉంటాయి అంటున్నారు.
హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!