Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ లిరిక్‌ రచ్చ… ఎందుకంత సీన్‌ చేస్తున్నారో?

ఊరంతా ఓ విషయం మీద డిస్కస్‌ చేస్తుంటే… ఆయన మాత్రం ఊరులో గోల ఎక్కువైంది అన్నాడట. ఏంటీ కొత్త సామెత అనుకుంటున్నారా? ఒరిజినల్‌ సామెత చెబితే ఎవరు హర్ట్‌ అవుతారో అని ఇలా చెప్పాం అన్నమాట. అసలు విషయం ఏంటంటే… సినిమాలో చాలా గ్రాండియర్‌గా తెరకెక్కిస్తున్న ఓ పాట లీక్‌ అయిపోయింది అంటూ ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా టీమ్‌ బాధపడుతూ ఏకంగా పోలీసు కంప్లైంట్‌ ఇచ్చింది. దీని మీద వాళ్ల కష్టాలేవో వాళ్లు పడుతున్నారు.

అయితే ఈ సమయంలో కొంతమంది మనోభావాలు బ్యాచ్‌ మాత్రం ఆ పాటలో లిరిక్స్‌ అభ్యంతరకరంగా ఉన్నాయి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాట లిరిక్‌లో ‘జాబిలి జాకెట్‌ వేసుకొని వచ్చెనండి’ అనే వాక్యం ఉంది. దీంతో జాబిలి, జాకెట్‌ ఏంటిది… తెలుగు సాహిత్యాన్ని, సినిమా పాటల్ని ఎక్కడకు తీసుకెళ్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ల మాటలను తప్పు పట్టడానికి లేదు. అలా అని ఇదే తొలిసారి అనేలా అడగడానికి లేదు.

గతంలో కూడా ఇలాంటి మాటలు, పాటలు చాలానే వచ్చాయి. దీంతో ఈ సందర్భంలో కొంతమంది ఆ విషయాల్ని గుర్తు చేస్తున్నారు. అప్పుడెప్పుడో ‘ఘరానా బుల్లోడు’ సినిమాలో ‘చుక్కల్లో తళుకులా…’ అనే పాటలో జాకెట్లో జాబిల్లి అంటూ దివంగత ప్రముఖ రచయిత వేటూరి రాశారు. దీంతో ఆ రోజుల్లో పాట గురించి పెద్ద ఎత్తున డిస్కషన్‌లు జరిగాయి. అయితే వాటికి ఆయన సింగిల్‌ డైలాగ్‌తో ఫుల్‌స్టాప్‌ పెట్టించేశారు. ఇప్పుడు అదే టాపిక్‌ నడుస్తోంది.

పాటలో అలా ఎందుకు రాశారు వేటూరిగారు అని ఎవరో ఆయన దగ్గర అడిగితే… ‘‘ట్యూన్ కోసం అలా రాశాను. మాములుగా అయితే జాకెట్లో రెండు జాబిలిలు అని రాసేవాడిని’’ అంటూ కౌంటర్‌ ఇచ్చారట. దీంతో అలా ఆయనలాగా ఇప్పుడు ఎవరూ కౌంటర్‌ ఇవ్వడం లేదు. ఇస్తే సరిపోయేది అని అంటున్నారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమాలో ఆ పాట ఎవరు రాశారో కానీ… ఇప్పుడు కౌంటర్‌ ఇస్తారేమో చూడాలి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus