టాలీవుడ్‌లో వరుస సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. కారణం కొంతమంది చెబుతున్నా, ఇంకొంతమంది కారణాలు చెప్పడం లేదు. అయితే ప్రధాన కారణం కరోనా అని అంటున్నారు. కరోనా కారణంగా ప్రజలు థియేటర్లకు రారు కాబట్టి… సినిమా వసూళ్లు కష్టం అందుకే సినిమా రిలీజ్‌లు ఆపేస్తాం అని వరుస పెట్టి ఆపేస్తున్నారు. అలా ‘లవ్‌స్టోరీ’, ‘టక్ జగదీష్’, ‘విరాటపర్వం’ ఆగిపోయాయి. ఈ వరుసలో మరికొన్ని సినిమాలు ఉన్నాయని కూడా టాక్. అక్కడివరకు ఓకే ఒకవేళ కరోనా తగ్గుముఖం పట్టినా సినిమాలు విడుదల చేయకూడదని నిర్మాతలు అనుకుంటున్నారట. అదీ విషయం.
త్వరలో తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యపెన్సీ విధానాన్ని తీసుకొస్తారని టాక్ వినిపిస్తోంది. దీంతోనే సినిమాల విడుదలకు నిర్మాతలు ఆలోచిస్తున్నారని అంటున్నారు. కరోనా తగ్గాక కూడా సగం మందితో సినిమా అంటే వసూళ్లు రావు అనేది వారి ఆలోచన. అయితే ఇలా ఆలోచిస్తున్న నిర్మాతలు మొన్నటి సంక్రాంతి సీజన్‌ను ఓ సారి గుర్తు చేసుకుంటే మంచిది అని పరిశీలకులు సూచిస్తున్నారు. సంక్రాంతి సమయానికి టాలీవుడ్‌లో 50 శాతం ఆక్యపెన్సీ మీదే థియేటర్లు నడిచాయి. కానీ ‘క్రాక్’ మంచి వసూళ్లు అందుకుంది. ‘సోలో బతుకే సోబెటరు’ కూడా బాగా నడిచింది.
దీంతో కరోనా కాస్త క్లియర్ అయ్యాక 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్నా సినిమాలు విడుదల చేసుకోవచ్చు అనేది పరిశీలకుల మాట. మరి నిర్మాతల ఆలోచన ఎలా ఉందో? మామూలు రోజుల్లోనే వీకెండ్స్‌లోనే సినిమాల వసూళ్లు ఎక్కువని పరిశ్రమ టాక్. అంతేకాదు ఒక సినిమా తర్వాత ఒక సినిమా వరుస కట్టి వారానికి వచ్చేస్తే 50 శాతం ఆక్యుపెన్సీతో డబ్బులు రావు అంటున్నారు. అయితే ఓటీటీ రిలీజ్ కంటే ఇదే బెటరూ అనుకునేవాళ్లూ ఉన్నారు. అయితే నిర్మాతలు మాట్లాడుకొని 14-21 రోజులకో పెద్ద సినిమా రిలీజ్ చేసుకున్నా బాగానే ఉంటుందేమో.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!