ఇదేం పిచ్చి వర్మ…?

  • August 26, 2016 / 06:23 AM IST

క్రైమ్ అన్న పదం వినపడితే చాలు….మనకున్నా టీవీ చానెళ్లు అన్నీ అక్కడే రాత్రుళ్ళు పడిగాపులు కాసి మరీ న్యూస్ కవర్ చేసేసి, సెన్సేషన్స్ వార్తలు ప్రసారం చేస్తూ తమ టీఆర్‌పీ రేటింగ్స్ పెంచుకుంటూ ఉంటాయి. అదే క్రమంలో కొన్ని ఛానెల్స్ అయితే అక్కడ జరిగిన సంఘటనను కల్పిత పాత్రలతో తెరకెక్కించి మరీ చూపిస్తూ ఆరకంగా క్యాష్ చేసుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే మీడియాగా ఆది వారి భాద్యత అని అనుకుందాం కాసేపు. ఈ విషయం పక్కన పెడితే…మన టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మది కాస్త అదే రకమైన స్టైల్. క్రైమ్ జరిగింది అంటే చాలు…అక్కడే వాలిపోయి, ఆ క్రైమ్, ఆ వ్యక్తి బ్యాక్ గ్రౌండ్, కధ అంతా తెలుసుకుని, వెంటనే దానిపై సినిమా తీసేస్తారు. సెన్సేషన్స్ తోనే సావాసం చేస్తాను అంటూ…

ముంబై దాడులపై ది అటాక్స్ ఆఫ్ 26/11.. కర్నాటకలో కిల్లింగ్ వీరప్పన్.. తెలుగులో రక్త చరిత్ర.. బెజవాడ… ఇప్పుడు వంగవీటి ఇలా జరిగిన సంఘటనల ఆధారంగానే సినిమా తెరకెక్కిస్తాడు. ఇదిలా ఉంటే తాజాగా జ్ఞాగ్ స్టార్ నయీమ్ మర్డర్ జరిగిన విషయం తెలుసుకున్న మన దర్శకుడు, నయీమ్ ఘోర నేర చరిత్రపై ఓ ట్రయాలజీ తీస్తానని ఇప్పటికే చెప్పాడు. అయితే అసలు ఇలాంటి సినిమాలు తియ్యడం వల్ల వర్మకు వచ్చే లాభం ఏంటో, సొసైటీకి జరిగే ప్రయోజనం ఎంతో తెలీదు కానీ అదే ప్రశ్న మన అడిగితే మాత్రం…నా ఇష్టం నేను తీస్తాను, నచ్చితే చూడండి నచ్చకపోతే మానెయ్యండి అని అని అందరి నోళ్ళు మూయించేస్తాడు. అంతేకాకుండా మరో క్రమంలో ఆయా నేరాల తీవ్రత చెప్పడం కరెక్టే కానీ.. ఆ కరడు కట్టిన నేరస్తుల పైనే సినిమాలు తీయడం కాస్త సమాజాన్ని ఇబ్బంది పెట్టే అంశమే అని చెప్పాలి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus