Vignesh Shivan: స్టార్‌ హీరో సినిమా విషయంలో కీలక మార్పు.. గమనించారా?

అజిత్‌ – అట్లీ కాంబినేషన్‌లో సినిమా అంటే.. ఈ మధ్య అభిమానులు ‘వద్దు బాబోయ్‌ వద్దు’ అంటూ సోషల్‌ మీడియాలో గోల గోల చేశారు. అయితే ఓవైపు విఘ్నేష్‌ శివన్‌ సినిమా స్టార్ట్‌ అవుతున్న టైమ్‌లో అట్లీ సినిమా గురించి ఎందుకు చర్చ వచ్చింది అంటూ ప్రశ్నలు వచ్చాయి. దీని సమాధానం కోసం వెతుకుతుండగా విఘ్నేష్‌ శివన్‌ క్లారిటీ ఇచ్చాడు. దీంతో ప్రాజెక్ట్‌ విషయంలో క్లారిటీ వచ్చినట్లు అయ్యింది. ఇంతకీ ఏమైందంటే…

అజిత్ హీరోగా నటించిన ‘తునివు’ / ‘తెగింపు’ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయం అందుకుంది. ఆ సినిమా తర్వాత అజిత్ ఏం చేస్తాడు అనే ప్రశ్నకు ఎప్పుడో క్లారిటీ వచ్చింది. అంటే కెరీర్‌లో 62వ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌లో ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. దీనికి విఘ్నేశ్‌ శివన్‌ను దర్శకుడిగీ అనౌన్స్ చేశారు కూడా. అయితే ఇప్పుడు ఆ సినిమా నుండి ఆయన తప్పుకున్నారు. ఈ మేరకు అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇవ్వలేదు కానీ ట్విటర్‌ బయోలో మార్పు చేశారు.

విఘ్నేష్‌ శివన్‌ ట్విటర్‌ బయోలో అజిత్‌ సినిమా మాయమైంది. అంటే AK62 అనే టెక్స్ట్‌ ఇప్పుడు విఘ్నేష్‌ బయోలో కనిపించడం లేదు. అంటే ఆ సినిమా నుండి తప్పుకున్నట్లే అని నెటిజన్లు అంటున్నారు. అయితే లైకా టీమ్‌ నుండి కానీ, అజిత్‌ నుండి కానీ ఎలాంటి స్పందనా లేదు. త్వరలోనే విఘ్నేష్‌ బదులు వేరే దర్శకుడు వచ్చారు అనే విషయం చెబుతారు అంటున్నారు. అది అట్లీనే అని అంటున్నారు కొంతమంది. అయితే గతంలో అట్లీ సినిమా అంటే వచ్చిన ఫ్యాన్స్‌ అభ్యర్థనలను అజిత్‌ లెక్కలోకి తీసుకుంటారో లేదో చూడాలి.

అట్లీ సినిమాలు ఫుల్‌ మాస్‌ మసాలాగా ఉంటాయి. అందులో ఇతర సినిమాల రిఫరెన్స్‌లు కూడా కనిపిస్తాయి. దీంతో ఎప్పుడూ కొత్తదనానికి ఓటేసే అజిత్‌.. అట్లీతో సినిమా చేయడం సరికాదు అని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. అయితే ఎలాంటి సినిమా అయితనా తీయగలిగే సత్తా అట్లీకి ఉంది అనేది ఆయన ఫ్యాన్స్‌ మాట. చూడాలి మరి ఏమవుతుందో, ఏం చేస్తారో?

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus