Pongal Fight: పొంగల్‌ ఫైట్‌: 22 ఏళ్ల క్రితం జరిగింది.. 2026లో జరుగుతుందా?

ఆ రోజు వచ్చాక చూద్దాం.. అప్పటికి రాజెవరో, పేదెవరో? అంటారు మన పెద్దలు. దీనిని సినిమాలకు అన్వయించుకుంటే ‘ఆ సీజన్‌ వచ్చాక చూద్దాం.. రిలీజ్ చేసేదెవరో, వెనక్కి వెళ్లేదెవరో?’ అని అనొచ్చు. వచ్చే సంక్రాంతి సీజన్‌కు ఈ మాట అనే అవకాశం రాకపోతే మూడు సినిమాలు పొంగల్‌ ఫైట్‌ బరిలో ఉంటాయి. అదే జరిగితే 22 ఏళ్ల క్రితం జరిగింది ఇప్పుడు మళ్లీ జరుగుతుంది. అప్పటి సంక్రాంతి హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్‌ ఇప్పుడు మరోసారి ఢీ అంటే ఢీ అనబోతున్నారు.

Pongal Fight

ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు ఒకే సీజన్‌లో రావడం చాలా అరుదు. ఒకవేళ వస్తే అది సంక్రాంతి సీజనే అవుతుంది. ఇప్పుడు అలానే 2026 సంక్రాంతి సీజన్‌కు నాలుగు సినిమాలు రెడీ అవుతున్నాయి. అందులో మూడు స్టార్‌ హీరోలవి కాగా, నాలుగోది కుర్ర హీరో సినిమా. దసరాకు రావాల్సిన ‘అఖండ 2: తాండవం’ సినిమా వాయిదా పడింది. కొత్త డేట్‌ని సినిమా టీమ్‌ ఇంకా అనౌన్స్‌ చేయలేదు. డిసెంబరు తొలి వారంలో లేకపోతే సంక్రాంతికి రావాలని నందమూరి బాలకృష్ణ అనుకుంటున్నారట.

ఒకవేళ సంక్రాంతికి వస్తేనే ఈ ఫీట్‌ కుదురుతుంది. 2004లో ‘లక్ష్మీ నరసింహా’ అంటూ బాలకృష్ణ.. ‘అంజి’గా చిరంజీవి.. ‘వర్షం’తో ప్రభాస్‌ వచ్చారు. ఇందులో ప్రభాస్‌ సినిమా ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌ కాగా, బాలయ్య సినిమా మంచి ఫలితమే అందుకుంది. ఇక చిరంజీవి సినిమా ఇబ్బందికర ఫలితం అందుకుంది. ఇప్పడు ‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’ సంక్రాంతికి వస్తున్నాం అని ఇప్పటికే చెప్పేశారు. డేట్‌ చెప్పడం లేదు కానీ జనవరి 14 అనేది ఒక టాక్‌.

మొన్నీమధ్య ‘ది రాజాసాబ్‌’ రిలీజ్‌ డేట్‌ని జనవరి 9 అని అనౌన్స్‌ చేశారు. ఇక బాలయ్య డేట్‌ చెప్పాల్సి ఉంది. ఇక రవితేజ కానీ నవీన్‌ పొలిశెట్టి కానీ ఓ సినిమాతో వచ్చే అవకాశం ఉంది. నిజానికి నవీన్‌ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతికే అని ఎప్పుడో చెప్పేశారు. చూద్దాం ఆ సీజన్‌ వచ్చేసరికి ఎవరు మిగులతారో, ఎవరు విజయం అందుకుంటారో?

ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus