The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?
- September 21, 2026 / 11:10 PM ISTByPhani Kumar
సరిగ్గా 2 క్రితం ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ రిలీజ్ అయ్యింది. తొలిరోజు ఈ సినిమాకి కొంత మిక్స్‌డ్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ వద్ద మాత్రం బాగానే సందడి చేసింది. దాన్ని బ్లాక్ బస్టర్ అనలేము, కానీ కమర్షియల్ గా సినిమా బాగానే గట్టెక్కి డీసెంట్ హిట్ అనిపించుకుంది. అయితే, ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యాక మాత్రం.. సినిమా కథ, కథనాలపై సోషల్ మీడియాలో బోలెడన్ని ట్రోల్స్ వచ్చాయి.
The Paradise

‘అసలు థియేటర్లలో ఈ సినిమా ఎలా నిలబడిందా?’ అని అంతా ఆశ్చర్యపోయారు. కానీ, ఆ ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక్క సమాధానం.. ‘అనిరుధ్ మ్యూజిక్’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవును, సినిమా టైటిల్ కార్డ్స్ పడినప్పటి నుండీ, ఎండ్ కార్డ్స్ పడే వరకు తన పవర్‌ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో అనిరుధ్ ఈ సినిమాను ఒంటిచేత్తో గట్టెక్కించాడు. అందులోని పాటలు కూడా పెద్ద చార్ట్ బస్టర్స్ అయ్యాయి.దాదాపుగా ఇప్పుడు అలాంటి భారీ బాధ్యతే నాని హీరోగా వస్తున్న ‘ది ప్యారడైజ్'(The Paradise) సినిమాకి కూడా అనిరుధ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఔట్‌పుట్ గురించి బయట రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమా సరిగ్గా రాలేదని, డైరెక్టర్‌కి, హీరోకి మధ్య విబేధాలు వచ్చాయని, బడ్జెట్ విషయంలో నిర్మాత కూడా నెత్తి నోరు కొట్టుకుంటున్నాడని.. ఇలా చాలా నెగిటివ్ రూమర్స్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. దానికి తగ్గట్టే కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండానే సినిమాని నేరుగా థియేటర్లలోకి దింపుతున్నారు. టీజర్‌లో నాని వాయిస్ ఓవర్ పైనా చాలా ట్రోల్స్ వచ్చాయి.
ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా అభిమానుల్లో ఉన్న ఏకైక నమ్మకం.. అనిరుధ్..! తన అద్భుతమైన మ్యూజిక్‌తో అతను ఈ సినిమాని కూడా కచ్చితంగా గట్టెక్కిస్తాడని భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఆయా షేర్’, ‘ఏషనాగుల’ పాటలు యూట్యూబ్, స్పాటిఫైలలో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టి సెన్సేషనల్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇది పూర్తిగా ఓ రా అండ్ రస్టిక్ మాస్ యాక్షన్ సినిమా కాబట్టి, యాక్షన్ ఎపిసోడ్స్ కు అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కరెక్ట్‌గా పడితే చాలు.. థియేటర్లలో ఆడియన్స్..కి పూనకాలు రావడం ఖాయం..!
సినిమా కూడా ఈజీగా గట్టెక్కేస్తుంది. శ్రీకాంత్ ఓదెల టేకింగ్‌కి, అనిరుధ్ బీజీఎమ్ తోడైతే మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. మరి ‘దేవర’ విషయంలో అనిరుధ్ చేసిన మ్యాజిక్, నాని ‘ది ప్యారడైజ్’ తో కూడా రిపీట్ అవుతుందేమో వేచి చూడాలి!















