Anushka Shetty: అనుష్కకు మళ్ళీ అదే సమస్య.. కానీ ఈసారి తగ్గదట..!

అనుష్కను మళ్ళీ అదే సమస్య పట్టి పీడిస్తుందట. అందుకోసం సినిమా నుండీ తప్పుకోవడానికి రెడీ అయిపోయిందట. ఇంతకీ ఏంటా సమస్య.. ఏ సినిమాని ఆమె వదులుకోబోతుంది, అనేగా మీ డౌట్? అక్కడికే వస్తున్నా..! తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న అనుష్క..వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే..! అయితే స్టార్ హీరోల సరసన ఈమె నటించాలి అంటే మాత్రం వెయిట్ తగ్గించుకోవాలి అంటూ దర్శకులు కండిషన్లు పెడుతున్నారట.

ఇప్పటికే చాలా ప్రాజెక్టులు ఈమె చేతికి అందినట్టే అంది చేజారిపోయాయని తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ అమ్మడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్న ఓ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. అయితే ఆ చిత్ర నిర్మాతలు అయిన ‘యూవీ క్రియేషన్స్’ వారు ఈమెను బరువు తగ్గమని చెప్పారట. కథ ప్రకారం హీరో, హీరోయిన్ల మధ్య 10 ఏళ్ళు ఏజ్ గ్యాప్ ఉన్నట్టు చూపిస్తారట. అంటే కథ ప్రకారం హీరో కంటే.. హీరోయిన్ 10 ఏళ్ళు పెద్దదన్న మాట. అయినప్పటికీ హీరో కంటే ఈమె పొడుగ్గా, లావుగా కనిపిస్తే బాగోదని.

అందుకోసం ఈమెను వెయిట్ తగ్గించమని నిర్మాతలు కోరినట్టు తెలుస్తుంది. అయితే వెయిట్ తగ్గించుకునే ప్రసక్తే లేదని.. కష్టంగా ఉంటే మరో హీరోయిన్ ను ఎంపిక చేసుకోమని అనుష్క తెగేసి చెప్పేసిందట. మరి నిర్మాతలు అనుష్కకు లొంగుతారా లేక వేరే హీరోయిన్ ను ఎంపిక చేసుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ డైరెక్ట్ చేయనున్నాడు.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus