బిందు మాధవి… బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ గా గత రెండు రోజులుగా ఈమె ట్రెండింగ్లో ఉంది. అయితే ఈమె గతంలో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది అన్న సంగతి ఎక్కువ మందికి గుర్తులేదు. స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల నిర్మాణంలో రూపొందిన ‘ఆవకాయ బిర్యానీ’ తో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈమె తెలుగమ్మాయి అని కూడా బహుశా చాలా మందికి తెలిసుండదు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మదనపల్లి ఈమె సొంత ఊరు. అంతేకాదు ‘లీడర్’ ‘బంపర్ ఆఫర్’ ‘రామ రామ కృష్ణ కృష్ణ’ వంటి సినిమాల్లో కూడా నటించింది.
తెలుగులో ఈమెకు ఆశించిన బ్రేక్ రాలేదని భావించి తమిళ్ లో కూడా ఈమె ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించింది. అయినప్పటికీ ఈమె సంతృప్తి చెందలేదు. దాంతో కమల్ హాసన్ హోస్ట్ చేసిన తమిళ ‘బిగ్ బాస్’ లో మిడ్ ఎంట్రీ ఇచ్చి టాప్ 5 లో నిలిచింది. ఇప్పుడు ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ లో కూడా ఎంట్రీ ఇచ్చి ఏకంగా టైటిల్ విన్నర్ గా నిలిచింది. అంతేకాదు తెలుగులో ‘బిగ్ బాస్’ స్టార్ట్ అయ్యాక ఓ లేడీ విన్నర్ అవ్వడం ఇదే మొదటి సారి.
అయితే బిందు మాధవి కెరీర్ ఇక నుండీ ఊపందుకుంటుందా? ‘బిగ్ బాస్’ విన్నర్ ఇమేజ్ ఆమెకు ఎంత వరకు కలిసొస్తుంది? అనే ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయి. తెలుగులో ‘బిగ్ బాస్’ విన్నర్ అయిన వాళ్ళంతా.. టైటిల్ విన్నర్ గా నిలిచిన నెల రోజుల వరకు వార్తల్లో నిలిచారు కానీ తర్వాత వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేరు. సినిమాల్లో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వచ్చేస్తాయి అనుకున్న వాళ్ళ ఆలోచనలు కూడా తలక్రిందులు అయ్యాయి.
మొదటి సీజన్ విన్నర్ శివ బాలాజీ ‘మా’ అసోసియేషన్ పేరు చెప్పుకుని మొన్నామధ్య కనపడ్డాడు కానీ తనకి సినిమాల్లో అవకాశాలు భారీగా వచ్చిన సందర్భాలు లేవు.
రెండో సీజన్ విన్నర్ కౌశల్ ను వాళ్ళ ఆర్మీనే పట్టించుకోవడం మర్చిపోయింది. ‘బిగ్ బాస్’ విన్నర్ ఇమేజ్ తో ఇతను హీరో అయిపోతాడు, విలన్ అయిపోతాడు అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు.
మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తనకి వచ్చిన పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు.. అప్పుడప్పుడు వివాదాల్లో నిలుస్తున్నాడు కానీ బిగ్ బాస్ ఇమేజ్ తో నటుడిగా నిలదొక్కుకున్న సందర్భాలు ఏమీ లేవు.
నాలుగో సీజన్ విన్నర్ అభిజీత్ సంగతి ఇక చెప్పనవసరం లేదు. అతనికంటే సోహెల్ ఎక్కువ పాపులర్ అయ్యాడు, సినిమాల్లో నటిస్తున్నాడు.
ఐదవ సీజన్ విన్నర్ సన్నీ కూడా బుల్లితెర పై తప్ప ఇక ఎక్కడా కనిపించడం లేదు. తను హీరోగా నటించిన పాత సినిమాలు కూడా విడుదల కావడం లేదు.
ఇవన్నిటినీ బట్టి..బిందు మాధవి టైటిల్ విన్నర్ గా నిలిచినా ఆ ఇమేజ్ తో ఈమె నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుందా? లేదా అనేది చూడాల్సి ఉంది.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!