Chiranjeevi, Prabhas: ఆ హీరో కోరికను మెగాస్టార్ తీరుస్తారా..?

ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన నువ్విలా మూవీతో హవీష్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు సినిమాతో హవీష్ నిర్మాతగా సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. రవితేజ హీరోగా రమేష్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఖిలాడీ సినిమాను కూడా హవీష్ నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుండగా స్టైలిష్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

నేడు హవీష్ పుట్టినరోజు కాగా మీడియాతో ముచ్చటించిన హవీష్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హీరోగా నటించడానికి రెండు కొత్త కథలను విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని త్వరలోనే నిర్మాతలు ఆ వివరాలను ప్రకటిస్తారని హవీష్ అన్నారు. మారుతి, లింగుస్వామి డైరెక్షన్ లో సినిమా కోసం చర్చలు జరిగాయని కథ కుదిరితే వాళ్ల డైరెక్షన్ లో సినిమా చేస్తానని హవీష్ పేర్కొన్నారు. కూకట్ పల్లిలో గ్రీన్ స్టూడియోను నిర్మిస్తున్నామని రవితేజ సినిమాకు సెట్స్ అక్కడే వేశామని హవీష్ వెల్లడించారు.

మరో వారం రోజుల్లో ఖిలాడీ షూటింగ్ మొదలుపెడతామని 20 రోజులు షూటింగ్ చేస్తే ఖిలాడీ పూర్తవుతుందని హవీష్ అన్నారు. దుబాయ్ లో కొన్ని సీన్స్ తెరకెక్కించాల్సి ఉందని హవీష్ చెప్పుకొచ్చారు. ప్రభాస్, చిరంజీవితో సినిమాలు నిర్మించే ఆలోచనలు చేస్తున్నామని హవీష్ అన్నారు. మరి హవీష్ కోరికను చిరంజీవి, ప్రభాస్ తీరుస్తారో లేదో చూడాల్సి ఉంది. కథ నచ్చితే ఏ పాత్రైనా చేస్తానని హవీష్ చెప్పుకొచ్చారు.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus