Rajamouli, Chiranjeevi: తండ్రి కోసం ఆ పని చేస్తున్న చరణ్?

మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. శంకర్ దాదా జిందాబాద్ తర్వాత రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమాలకు దూరమైన చిరంజీవి వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. అయితే చిరంజీవి రాజమౌళి కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎంతోమంది స్టార్ హీరోలకు కెరీర్ బెస్ట్ హిట్లు ఇచ్చిన రాజమౌళి చిరంజీవితో ఒక సినిమా తెరకెక్కిస్తే బాగుంటుందని మెగాఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ కాంబోలో మూవీ తెరకెక్కడం సాధ్యమా..? కాదా..? అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానాన్ని మాత్రం చెప్పలేం. ప్రస్తుతం చిరంజీవి, రాజమౌళి వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మహేష్ బాబుతో రాజమౌళి ఒక సినిమాను తెరకెక్కించాల్సి ఉండగా వచ్చే ఏడాది సినిమా షూటింగ్ మొదలుకానుంది. చిరంజీవి జక్కన్న కాంబోలో ప్రకటన వెలువడితే ఆ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. చరణ్ ఇప్పటికే రాజమౌళితో చిరంజీవితో ఒక సినిమాను తెరకెక్కించాలని కోరారని వార్తలు వినిపిస్తున్నాయి.

మరి రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాల్సి ఉంది. రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. మల్టీస్టారర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా జక్కన్న ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus