టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఆయన తన సినిమాలన్నీ పక్కా ప్లానింగ్ తో తీస్తుంటారు. ఏ సినిమాను ఎంత బడ్జెట్ లో తీయాలి..? ఎలాంటి కథలు ఆడియన్స్ కి రీచ్ అవుతాయనే విషయంలో దిల్ రాజుకి మంచి జడ్జిమెంట్ ఉంది. అందుకే సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్నారు. పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ లో సినిమాలు తీసినా.. తన లెక్క కరెక్ట్ గా ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు దిల్ రాజు.
సినిమా విషయంలో పక్కాగా ఉండే దిల్ రాజుకి ఇప్పుడు రెండు సినిమాలు కాస్త ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి ‘వారసుడు’ సినిమా కాగా.. మరొకటి రామ్ చార-శంకర్ సినిమా. రామ్ చరణ్ సినిమా అనుకున్నదానికంటే ఆలస్యం కావడం వలన బడ్జెట్ పెరిగిందని స్వయంగా దిల్ రాజే వెల్లడించారు. ఇక ‘వారసుడు’ సినిమా విషయానికొస్తే.. హీరో విజయ్ ఒక్కడికే రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి తన ప్రతి సినిమాకి కాస్త ఎక్కువగానే ఖర్చు పెట్టిస్తారు.
‘ఊపిరి’, ‘మహర్షి’ లాంటి సినిమాలు సక్సెస్ అయినా.. భారీ లాభాలు రాబట్టకపోవడానికి ఇదే కారణం. ‘వారసుడు’ విషయంలో కూడా అదే జరుగుతోంది. రెమ్యునరేషన్స్ ఎక్కువ, బడ్జెట్ కూడా పెరిగిపోయింది. ఈ సినిమా విషయంలో దిల్ రాజు వేసుకున్న ప్రణాళిక ఫలించలేదని తెలుస్తోంది. ఈ సినిమాకి తమిళంలో ఉన్న క్రేజ్ కారణంగా అక్కడ మంచి బిజినెస్ జరిగినా.. డిస్ట్రిబ్యూటర్స్ లో టెన్షన్ అయితే లేకపోలేదు.
తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు చేతిలో ఎక్కువ థియేటర్లు ఉండడం వలన మంచి రిలీజ్ దక్కొచ్చు కానీ ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సినిమాల పోటీని తట్టుకొని విజయ్ సినిమా ఏమాత్రం నిలుస్తుందనే సందేహాలు కలుగుతున్నాయి. మరి ఈ సినిమా దిల్ రాజుని లాభాలతో బయటపడేస్తుందో లేదో చూడాలి!
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!