‘రైడ్‌’ చూసినోళ్లకు ‘బచ్చన్‌’ కొత్త సినిమానే.. మరి విజయం దక్కుతుందా?

  • August 2, 2024 / 05:11 PM IST

ఎవరు ఏమన్నా రీమేక్‌లను తీయడం ఓ ఆర్ట్‌.. దానిని పర్‌ఫెక్ట్‌గా చేసినోళ్లు చరిత్రలో నిలిచిపోతారు. ఈ మాటను మీరు ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ.. మన దగ్గర వచ్చిన రీమేక్‌లు, వాటి రెస్పాన్స్‌లు చూస్తే ఈ మాట కచ్చితంగా అనాలని అనిపిస్తోంది. ఎందుకు అనేది ఆఖరులో చెబుతాం కానీ. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అంటే ‘మిస్టర్‌ బచ్చన్‌’(Mr. Bachchan) సినిమా వస్తోంది కాబట్టి. రవితేజ  (Ravi Teja) , హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది.

సినిమా మాతృక ‘రైడ్‌’కి హరీశ్‌ కొన్ని మార్పులు చేశారని, దాని వల్ల ఒరిజినల్‌ చూసినవాళ్లకు కూడా ఈ సినిమా కొత్తగా ఉంటుంది అని అంటున్నారు. ఈ మాటలో నిజానిజాలు ఏంటో తెలియడానికి ఆగస్టు 15న తేలుతుంది. అయితే ట్రైలర్‌ చూశాక కొంతమంది ఆ మార్పులను అనలైజ్‌ చేస్తున్నారు. ‘దబంగ్‌’ సినిమాను ‘గబ్బర్‌ సింగ్‌’ (Gabbar Singh)  గా.. ‘జిగర్‌తండా’ను ‘గద్దలకొండ గణేశ్‌’గా రీమేక్‌ చేసి మెప్పించారు హరీశ్‌ శంకర్‌. ఇప్పుడు ‘రైడ్‌’ని ‘మిస్టర్‌ బచ్చన్‌’గా మార్చారు.

ఒరిజినల్‌ సినిమా సీరియస్ డ్రామా. అందులో హీరోయిన్ ఇలియానాది (ileana) గ్లామర్ షోకి అవకాశం లేని భార్య పాత్ర. విలన్ ఇంటి మీద ఇన్కమ్ టాక్స్ రైడింగ్ అయ్యాక జరిగే ట్విస్టులు సీరియస్‌గా, ఒకే టెంపోలో సాగుతాయి. ఇప్పుడు చూస్తే ప్రియురాలు, డ్యూయెట్లు, ఎలివేషన్ ఫైట్లు, రొమాన్స్ గట్టిగా దట్టించారు. దీంతో ‘మిస్టర్ బచ్చన్’ ఫలితం రీమేక్‌ల గురించి చర్చించేవాళ్లకు ఆసక్తికరంగా మారింది.

సినిమా ఫలితం బాగుంటే ఓకే.. లేదేంటే సినిమాను చెడగొట్టేశారు అని విమర్శల బాణాలు ఎక్కపెడతారు. అదే అక్కడ ఉన్న విషయాన్ని పెద్దగా మార్పులు లేకుండా తీసేస్తే యాజ్‌ ఇట్‌ ఈజ్‌ తీసేశారు అని అంటారు. దీంతో రీమేక్‌ల సినిమా ప్రేమికుల బారిన పడకుండా హరీశ్‌ శంకర్‌ ఈ సినిమాను ఎలా హ్యాండిల్‌ చేశారో చూడాలి. ఆఖరున చెబుతాం అని అన్నాం కదా పైన.. అది ఈ విషయమే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus