‘నీళ్లలో ఈదే చేపకి… గాలిలో ఎగిరే పక్షికి’ సంబంధం ఉంది అనడం ఎంత మూర్ఖత్వమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సరిగ్గా ఇలాగే ఇప్పుడు కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ విషయం పై అంటే.. ‘మెగా ఫ్యామిలీ పై ‘గీతా ఆర్ట్స్’ సంస్థ వ్యతిరేకంగా పనిచేస్తుందా అని..! ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల ‘అన్- స్టాపబుల్’ మొదటి ఎపిసోడ్ కు చంద్రబాబు- లోకేష్ లు గెస్ట్ లుగా వచ్చారు. ‘ఒకప్పుడు కాంట్రవర్సీ అయిన విషయాలను ఈ షో ద్వారా కవర్ చేస్తున్నారు అనే అనుమానాలు గత సీజన్లోనే చాలా వ్యక్తమయ్యాయి’.
ఇప్పుడు కూడా అలాంటి అనుమానాలు, ఊహాగానాలే వ్యక్తమవుతున్నాయి. విషయం ఏంటి అంటే ఈ షోలో ‘చంద్రబాబు 1995 లో ఎన్టీఆర్ – వైస్రాయ్ హోటల్ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. ‘ఇందులో నా తప్పేమైనా ఉందా.. ఆ రోజు కాళ్ళు పట్టుకుని మరీ అడిగాను’ అంటూ చంద్రబాబు … పెద్ద ఎన్టీఆరే తప్పు చేసినట్టు కామెంట్లు చేశాడు. నిజానికి పార్టీ అల్లకల్లోలం కాకూడదు అనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు చాలా మంది చెప్పుకుంటారు.
సరే ఈ విషయాన్ని పక్కన పెడితే..! ‘ఆహా’ అల్లు వారిది అన్నప్పుడు జనసేన కి మద్దతు ఇవ్వాలి కానీ టీడీపీకి మద్దతు ఇవ్వడం ఏంటి అని కొంతమంది కాంట్రవర్షియల్ కామెంట్లు చేస్తున్నారు. మరోపక్క ‘గాడ్ ఫాదర్’ చిత్రం మంచి కలెక్షన్లు రాబడుతుంటే.. ‘కాంతారా’ చిత్రాన్ని ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై రిలీజ్ చేసి ‘గాడ్ ఫాదర్’ కలెక్షన్స్ దెబ్బ తీయడమేంటి? వాంటెడ్ గానే ఇలా చేస్తున్నారు అంటూ అల్లు ఫ్యామిలీ పై మండిపడుతున్నారు.
ఇందులో వాళ్ళ తప్పేమి ఉంది. అసలు వాళ్ళు మెగా ఫ్యామిలీకి జనసేన కి వ్యతిరేకంగా చేస్తున్నారు అనడం కరెక్ట్ కాదు. షోలో ఏం చెప్పినా జనాలు పాజిటివ్ గా తీసుకుంటారు అన్నది లేదు. మరోపక్క ‘గాడ్ ఫాదర్’ సినిమా కలెక్షన్లు ‘కాంతారా’ వల్ల దెబ్బ తిన్నాయి అనడం కూడా సరికాదు.