జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) దేవర (Devara) థియేటర్లలో విడుదలై పది రోజులైంది. పది రోజుల్లో ఈ సినిమాకు 200 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఫుల్ రన్ లో ఈ సినిమా 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. గత శుక్రవారం విడుదలైన సినిమాలకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడం దేవర మూవీకి ఒక విధంగా ప్లస్ అయిందని చెప్పవచ్చు. దసరా పండుగకు సినిమా చూడాలని భావించే ప్రేక్షకులలో ఎక్కువమందికి దేవర మూవీ ఫస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందని చెప్పవచ్చు.
అయితే దేవర సినిమా రూ.1000 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ లేదు. వార్2, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబో సినిమాలు సులువుగానే ఈ మార్క్ ను అందుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. వార్2 మూవీ మల్టీస్టారర్ కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ సినిమాతోనే తారక్ మరిన్ని సంచలనాలు సృష్టిస్తాడని ఫీలవుతున్నారు. సోలో హీరోగా తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది.
దేవర సీక్వెల్ విషయంలో మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఫస్ట్ పార్ట్ ను ఎన్నో రెట్లు మించేలా దేవర2 ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర సీక్వెల్ స్క్రిప్ట్ విషయంలో కొరటాల శివ (Koratala Siva) కొన్ని మార్పులు చేయనున్నారని తెలుస్తోంది. 2026 సంవత్సరంలో దేవర సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
దేవర సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులకు సైతం ఎక్కువ సమయం పడుతుందని తెలుస్తోంది. దేవర సీక్వెల్ పై నెమ్మదిగా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుండటం గమనార్హం. దేవర సినిమాకు వీక్ డేస్ లో కూడా బుకింగ్స్ బాగానే ఉండటం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. దేవర2 బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.