Anirudh: వేట్టయన్ మూవీకి అనిరుధ్ అదిరిపోయే రివ్యూ.. ఏం చెప్పారంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయన్ మూవీ ఈ నెల 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన వేట్టయన్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో రజనీకాంత్ ఖాతాలో జైలర్ రేంజ్ హిట్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్ సైతం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసిందని చెప్పవచ్చు. అయితే అనిరుధ్ ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు.

Anirudh

వేట్టయన్ బీజీఎం పనులను ఇప్పటికే పూర్తి చేసిన అనిరుధ్ వేట్టయన్ మూవీ లక్ష్యాన్ని సాధిస్తుందని సినిమాటిక్ అనుభూతిని అందజేస్తుందని చప్పట్లు కొట్టిస్తుందని బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలుస్తుందని అనిరుధ్ ఎమోజీల ద్వారా చెప్పారు. అనిరుధ్ గతంలో పాజిటివ్ రివ్యూలు ఇచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. అనిరుధ్ పాజిటివ్ రివ్యూ ఇచ్చిన దేవర మూవీ మిక్స్డ్ టాక్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుండటం గమనార్హం.

వేట్టయన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా జై భీమ్ డైరెక్టర్ మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మంజు వారియర్ స్టెప్పులు సైతం ఈ సినిమాకు ప్లస్ కానున్నాయని చెప్పవచ్చు. వేట్టయన్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వేట్టయన్ మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. వేట్టయన్ రజనీకాంత్ రెగ్యులర్ సినిమాలకు భిన్నమైన సినిమా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వేట్టయన్ సినిమా సక్సెస్ సాధిస్తే టీజే జ్ఞానవేల్ స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రజనీకాంత్ భవిష్యత్తు సినిమాలపై సైతం అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వేట్టయన్ సినిమా రన్ టైమ్ ఒకింత ఎక్కువగానే ఉండనుందని సమాచారం అందుతోంది.

అదే మెగా ఫ్యామిలీ తప్పా.. విమర్శలపై టాలీవుడ్‌ మౌనానికి కారణమిదేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus