Jr NTR, Mahesh Babu: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అలా చేస్తారా?

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆగష్టు నుంచి మొదలుకానుందని క్లారిటీ వచ్చింది. ఈ సినిమా ప్రకటన వెలువడిన సమయంలోనే తారక్ కొరటాల శివ కాంబో మూవీకి సంబంధించిన ప్రకటన కూడా వెలువడింది. అయితే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఫ్యాన్స్ కు సైతం క్లారిటీ లేదు. ఎన్టీఆర్ నుంచి కొరటాల శివ సినిమాకు సంబంధించి క్లారిటీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్ తర్వాత తారక్ ఖాళీగా ఉండటం అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. తారక్ తర్వాత సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. తారక్ తన సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇచ్చిన అప్ డేట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో మరో హీరోగా నటించిన చరణ్ వేగంగా సినిమాలలో నటిస్తుండగా తారక్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ సినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించి కూడా క్లారిటీ లేదనే సంగతి తెలిసిందే.

తారక్ బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయినా తన కొత్త సినిమాకు సంబంధించి క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది. సినిమాసినిమాకు తారక్ రేంజ్ పెరుగుతోంది. అదే సమయంలో తారక్ కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్న తారక్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఘన విజయాలను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.

రాజమౌళి మూవీలో నటించిన హీరో తర్వాత సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ ను ఈ సినిమాతో తారక్ కచ్చితంగా బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తారక్ కు జోడీగా ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ నటించే ఛాన్స్ ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. తారక్ పాన్ ఇండియా సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus