యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 17 ఏళ్ల వయస్సులోనే స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకోవడంతో పాటు ఆది, సింహాద్రి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను సాధించిన సంగతి తెలిసిందే. అయితే సింహాద్రి తరువాత వరుస ఫ్లాపుల వల్ల ఎన్టీఆర్ కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. మరోవైపు బరువు పెరగడం కూడా ఎన్టీఆర్ కెరీర్ కు మైనస్ గా మారింది. సింహాద్రితో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన రాజమౌళి ఫ్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్ కు యమదొంగతో మళ్లీ బ్లాక్ బస్టర్ ఇచ్చారు.
అయితే యమదొంగ తరువాత ఎన్టీఆర్ నటించిన అదుర్స్, బృందావనం హిట్ అయినా మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. మళ్లీ టెంపర్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన ఎన్టీఆర్ వరుసగా ఐదు బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా తరువాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లతో పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా హీరోగా ఎదగాలనే ఆలోచనతో ఎన్టీఆర్ కథలను,
డైరెక్టర్లను ఎంపిక చేసుకుంటూ ఉండగా పాన్ ఇండియా కథలను సిద్ధం చేయలేని డైరెక్టర్లకు ఎన్టీఆర్ దూరమైనట్టేనని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎన్టీఆర్ కరోనా నుంచి తాను కోలుకుంటున్నానని త్వరలోనే కరోనాను జయిస్తానంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన ఎన్టీఆర్ కు కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా కథలకే ఓకే చెబుతున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా అనుకున్న టార్గెట్ ను రీచ్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!