Alia Bhatt Remuneration: ఆ వార్తలపై కొరటాల శివ స్పందిస్తారా?

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఈ దర్శకుడు సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పారు. ఈ డైరెక్టర్ దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ సినిమా గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నా ఆ వార్తల గురించి ఎవరూ స్పష్టతనివ్వడం లేదు. ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోను హోస్ట్ చేస్తున్న సమయంలో కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా సెట్ పనులు జరుగుతున్నాయని చెప్పారు.

అయితే ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ అధికారికంగా రాలేదు. అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అని అలియా భట్ ఈ సినిమాలో హీరోయిన్ అని వార్తలు తెగ ప్రచారంలోకి వస్తుండగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వార్తలు నిజమేనని నమ్ముతున్నారు. అయితే దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న అలియా భట్ ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

టాలీవుడ్ డైరెక్టర్లు ఆ స్థాయి రెమ్యునరేషన్ హీరోయిన్లకు ఇవ్వడం ఇప్పటివరకు జరగలేదు. ఎన్టీఆర్30 సినిమాకు సంబంధించి ఎన్నో రూమర్లు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో కొరటాల శివ లేదా ఎన్టీఆర్ స్పందించి వివరణ ఇవ్వాల్సి ఉంది. ఎన్టీఅర్30 షూటింగ్ ఆలస్యమవుతూ ఉండటంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య మూవీ రిలీజైన తర్వాతే ఎన్టీఆర్ కొరటాల శివ మూవీ మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదే సినిమాను రిలీజ్ చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

అభిమానుల అభిప్రాయాల గురించి మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు ఎన్టీఆర్ తర్వాత సినిమా కోసం లుక్ ను పూర్తిగా మార్చుకుంటున్నారు. ఈ సినిమా కోసం తారక్ బరువు తగ్గిన సంగతి తెలిసిందే.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus