Kriti Sanon, Allu Arjun: కృతి మనసులో మాట చెప్పేసింది… ఇక బన్నీనే తేల్చాలి.. ఏమంటాడో?

  • August 28, 2023 / 06:32 PM IST

నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ / యాక్ట్రెస్‌ అనిపించుకోవడం అంత ఈజీగా కాదు. మామూలుగా నటించేస్తోనో, ఫీట్లు చేసేస్తోనో ఆ అవార్డులు ఇవ్వరు. దాని కోసం ఆ నటి లేదా నటుడు చాలా కృషి చేయాలి. అలా 2021లో కృషి చేసి పురస్కారాలు గెలుచుకున్నారు అల్లు అర్జున్‌, కృతి సనన్‌. అలాంటి ఈ ఇద్దరు ఇప్పుడు కలసి ఒకే సినిమా చేస్తే.. ఆ ఊహే అదిరిపోతుంది కదూ. ఇప్పుడు ఈ మాట ఎందుకొచ్చింది అనుకుంటున్నారా? సోషల్‌ మీడియాలో జరిగిన ఓ చర్చ వల్లనే.

‘పుష్ప: ది రైజ్‌’ సినిమాలోని నటనకుగాను అల్లు అర్జున్‌, ‘మిమీ’ సినిమాలోని నటనకుగాను కృతి సనన్‌ జాతీయ అవార్డు గెలుచుకున్నారు. త్వరలో వీరికి పురస్కారాలు అందిస్తారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ఉత్తమ యాక్టర్స్‌ కలసి నటిస్తారా? అనే ప్రశ్న మొదలైంది. దీనికి కారణం కృతి సనన్‌ పెట్టిన ట్వీటే. ఇటీవల కృతి సనన్‌, అలియా భట్‌కు అల్లు అర్జున్‌.. ‘ఎక్స్‌’లో అభినందనలు తెలిపాడు. ఈ క్రమంలో వాళ్లు కూడా ‘మీక్కూడా కంగ్రాట్స్‌’ అని వాళ్లు రిప్లై ఇచ్చారు. వారికి తిరిగి బన్నీ థ్యాంక్స్‌ కూడా చెప్పాడు.

అయితే ఈ ట్వీట్‌కు కృతి సనన్‌ ఇచ్చిన రిప్లై ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మనిద్దరం కలసి ఓ సినిమా చేయాలని ఉంది అంటూ ఆమె తన మనసులో మాట బయటపెట్టింది. అంతేకాదు తన ఫేవరెట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ‘పుష్ప 2’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని కూడా ట్వీట్‌లో పేర్కొంది. దీంతో ఈ ఇద్దరూ కలసి నటిస్తే బాగుంటుంది అంటూ చర్చ మొదలైంది. ‘తదుపరి సినిమాలో హీరోయిన్‌గా కృతిని ఎంపిక చేయాలి’ అంటూ కొందరు ఫ్యాన్స్‌ బన్నీని ఉద్దేశిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

కృతి సనన్‌ (Kriti Sanon) తెలుగులోకి పరిచయమైంది సుకుమార్ దర్శకత్వంలోనే. మహేష్‌బాబుతో సుకుమార్‌ చేసిన ‘1: నేనొక్కడినే’లో ఆమె నటించింది. ఆ తర్వాత ‘దోచెయ్‌’ అంటూ నాగచైతన్యతో నటించినా.. ఆ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేదు. ఆ తర్వాత మళ్లీ కృతి టాలీవుడ్‌కి రాలేదు. చూడాలి ఇప్పుడు బన్నీతో ఏదైనా సినిమా చేస్తుందేమో.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus