Mrunal Thakur: బాలీవుడ్‌ స్టార్‌ హీరోతో మృణాల్‌ సినిమా.. ఆ హీరోయిన్‌లా చేస్తుందా?

తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నప్పుడు, వచ్చిన సినిమాలు మంచి ఫలితాలే సాధిస్తున్నప్పుడు ఓ హీరోయిన్‌ బాలీవుడ్‌ వెళ్తోంది. అయితే ఆమె అక్కడి నుండే ఇక్కడకు వచ్చింది అనుకోండి. ఇదంతా వింటుంటే మీ మనసులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) పేరు గుర్తుకు రావడం సహజం. ఎందుకంటే ఆమె అలానే మధ్యలో టాలీవుడ్‌ కెరీర్‌ వదిలేసి వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు విషయం ఆమె కాదు.. మరో నాయిక. ఆమెనే మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) . ‘సీతారామం’ (Sita Ramam). సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్‌ ఠాకూర్‌ మరీ యంగ్‌ అని కాదు.

కాస్త వయసు వచ్చాక టాలీవుడ్‌లోకి వచ్చింది. రావడం రావడం సీతగా జనాల్లో మనసుల్లో చెరగని ముద్ర వేసింది. అయితే ఇప్పుడు ఆమె బాలీవుడ్ వెళ్తాను అంటోంది. ఇక్కడ కెరీర్‌ బాగానే ఉంది కదా.. ఇప్పుడెందుకు బాలీవుడ్‌ అంటే నేను ‘ఆడా ఉంటా ఈడా ఉంటా’ అంటోంది. ఈ క్రమంలో జనాలకు మరో రకుల్‌ గుర్తుకొస్తోంది. ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌’ సినిమాతో నవ్వులు పంచిన అజయ్‌ దేవగణ్  (Ajay Devgn) , సంజయ్‌ దత్‌ (Sanjay Dutt) మరోసారి వస్తున్నారు.

ఆ సినిమా సీక్వెల్‌ ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌ 2’ కి అంతా రెడీ చేసుకున్నారు. ఈ సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌ని కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటించడానికి మృణాల్‌ కూడా ఉత్సాహంగా ఉందని సమాచారం. ఈ నెలాఖరులో సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తారని టాక్‌. మృణాల్, అజయ్‌ మధ్య పాటలు, సన్నివేశాలు స్కాట్లాండ్‌లో షూట్‌ చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం అజయ్‌ దేవగణ్‌ ‘దే దే ప్యార్‌ దే 2’ (De De Pyaar De) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

అదయ్యాక ‘సన్ ఆఫ్‌ సర్దార్‌ 2’ స్టార్ట్‌ చేస్తారట. అయితే ఇక్కడ డౌట్‌ ఏంటంటే ‘దే దే ప్యార్‌ దే’ తో బాలీవుడ్‌కి సెకండ్‌ ఇన్నింగ్స్‌కి వెళ్లిన రకుల్‌ ఇక్కడ క్రమేపీ సినిమాలు తగ్గించి ఆ తర్వాత పూర్తిగా దూరమైంది. ఇప్పుడు మృణాల్‌ ఠాకూర్‌ కూడా ఇలానే చేస్తుందా అనేది డౌట్‌.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus