అక్కినేని మూడో తరం హీరో నాగ చైతన్య.. ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ‘యుద్ధం శరణం’ ‘శైలజారెడ్డి అల్లుడు’ ‘సవ్యసాచి’ వంటి చిత్రాలతో డిజాస్టర్లను మూటకట్టుకున్న చైతన్య ఆ తర్వాత.. ‘మజిలీ’ తో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే ‘వెంకీ మామ’ అనే మల్టీ స్టారర్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కరోనా సెకండ్ లాక్ డౌన్ ముగిసాక జనాలు అంతంత మాత్రంగానే థియేటర్లకు వస్తున్న తరుణంలో ‘లవ్ స్టోరీ’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఆ చిత్రం విడుదలయ్యే ముందు ‘ఇది హిట్ అయినప్పటికీ సాయి పల్లవి, శేఖర్ కమ్ములకి మాత్రమే క్రెడిట్ పోతుంది’ అని అంతా అనుకున్నారు. కానీ ఆ చిత్రంలో చైతన్య పెర్ఫార్మన్స్ అందరితోనూ క్లాప్స్ కొట్టించింది. బాక్సాఫీస్ వద్ద ఆ టైములో రూ.30 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయిన సినిమాగా ‘లవ్ స్టోరీ’ రికార్డులు సృష్టించింది. ఆ మూవీతో చైతన్య తన కెరీర్లో తొలిసారి హ్యాట్రిక్ ను కంప్లీట్ చేసాడు.
ఇక తాజాగా సంక్రాంతి కానుకగా వచ్చిన ‘బంగార్రాజు’ కూడా సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. నాగ చైతన్యకి .. ఈ చిత్రం మరింత ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకి అతను మరింత దగ్గరయ్యాడు. ఓ మీడియం రేంజ్ హీరో వరుసగా నాలుగు సార్లు రూ.50 కోట్ల(గ్రాస్) క్లబ్ లో చేరడం ఇదే మొదటిసారి.
ఇప్పట్లో పెద్ద హీరోల సినిమాలు వచ్చే అవకాశాలు తక్కువ. కాబట్టి ‘థాంక్యూ’ తో కూడా చైతన్య హిట్టు కొడితే.. వెంటనే సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ లు అందుకుంటే..అతను స్టార్ అయ్యే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.