బిగ్ బాస్ 4: వీకండ్ టెన్షన్.. టెన్షన్…!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో ఇప్పుడు 9వ వారం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ముఖ్యంగా వీకెండ్ నాగార్జున వచ్చి ఏ పాయింట్స్ పై మాట్లాడతాడు అనేది బిగ్ బాస్ లవర్స్ కి టెన్షన్ టెన్షన్ గా ఉంది. ఏ పాయింట్ మాట్లాడకపోయినా పర్లేదు కానీ, మోనాల్ అమ్మరాజశేఖర్ తో అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ గురించి అన్న మాటలు మాత్రం ఖచ్చితంగా చూపించాలని అంటున్నారు.

ఎందుకంటే, అఖిల్ మోనాల్ ని నామినేట్ చేసిన తర్వాత అమ్మరాజశేఖర్ మాస్టర్ తో మోనాల్ అమ్మాయి అబ్బాయి ప్రెండ్షిప్ అంటే అది వేరు, చాలా కావాలి. మోర్ కావాలి అంటూ మాట్లాడింది. ఆ వీడియోని ఖచ్చితంగా అఖిల్ కి చూపించి , మోనాల్ దగ్గర క్లారిటీ తీస్కోవాల్సి ఉంది. అప్పుడే బిగ్ బాస్ వీకండ్ షోలో మజా అనేది వస్తుంది. అలాగే అమ్మరాజశేఖర్ కెప్టెన్ అవ్వగానే మెహబూబ్ కి ఇచ్చిన ప్రామిస్ తర్వాత అమ్మరాజశేఖర్ వర్క్ ని డివైడ్ చేసి అందరూ సమానమే అన్న డైలాగ్స్ పై కూడా మాట్లాడాల్సి ఉంది. ఈ వీడియోని కూడా చూపిస్తే అందరి హౌస్ మేట్స్ కి అమ్మ గురించి తెలుస్తుంది.

ఇక మిగతా హౌస్ మేట్స్ కూడా టాస్క్ లో ఎవరు బాగా ఆడారు. ఎవరు గేమ్ ని రాంగ్ గా ఆడుతున్నారు అనేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రిసీవ్ చేస్కుంటారు అనేది తెలుసుకోవడానికి చాలా టెన్షన్ టెన్షన్ పడుతున్నారు. నాగార్జున ఏ పాయింట్స్ పై మాట్లాడతాడు అనేది కూడా ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచుతోంది. లాస్ట్ టైమ్ అరియానా గేమ్ ని బాగా మెచ్చుకున్న నాగ్ ఇప్పుడు అరియానా గేమ్ పై ఎలాంటి కామెంట్ చేస్తారు. ? అలాగే హారిక ఆడిన సీక్రెట్ గేమ్ గురించి ఎలా రియాక్ట్ అవుతారు ? అభిజిత్ కి అమ్మకి నామినేషన్స్ అప్పుడు జరిగిన ఘర్షణపై ఎలా స్పందిస్తారు ? అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇక్కడే ఈవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఏదైనా ట్విస్ట్ ఇవ్వబోతున్నారా..? ఇన్ని రోజులు హౌస్ లో జెర్నీ చేసిన మిగతా హౌస్ మేట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే ఎలా రిసీవ్ చేస్కుంటారు అనేది బిగ్ బాస్ లవర్స్ ని ఊరిస్తోంది. అందుకే ఈ వీకండ్ ఎపిసోడ్ అనేది ప్రత్యేకంగా మారింది.

ఆల్రెడీ ముంబైలో షూటింగ్ ఫినిష్ చేసుకున్న నాగార్జున బిగ్ బాస్ షో షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చేశారు. సో, ఇప్పుడు నాగార్జున ఎవరిపై ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. అదీ మేటర్.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus