Hero Nani: ఆ దర్శకునిపై నానికి ఇంత నమ్మకమా?

న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన అంటే సుందరానికి సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయని సమాచారం అందుతోంది. శనివారం, ఆదివారాలలో ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉన్నాయి. పరిమిత బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిన నేపథ్యంలో ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. నాని ఈ సినిమాతో పాటు దసరా సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలతో పాటు నాని దర్శకుడు మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతోంది. కొన్నేళ్ల క్రితం నాని మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో కృష్ణార్జున యుద్ధం అనే సినిమా తెరకెక్కింది. నాని డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. కృష్ణార్జున యుద్ధం ఫ్లాపైనా మాస్ట్రో, ఏక్ మినీ కథ సినిమాలతో మేర్లపాక గాంధీ ప్రూవ్ చేసుకున్నారు.

టాలెంట్ ఉన్న దర్శకులను ప్రోత్సహించే విషయంలో నాని ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. కృష్ణార్జున యుద్ధం ఫ్లాపైనా మేర్లపాక గాంధీపై నమ్మకం ఉండటంతో మరో ఛాన్స్ ఇవ్వడానికి నాని సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే మేర్లపాక గాంధీ చెప్పిన లైన్ నానికి బాగా నచ్చిందని బోగట్టా. ప్రస్తుతం సంతోష్ శోభన్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న మేర్లపాక గాంధీ ఈ సినిమా విడుదలైన తర్వాత నాని సినిమాపై దృష్టి పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

దర్శకుల ట్రాక్ రికార్డ్ తో సంబంధం లేకుండా టాలెంట్ ను నమ్మి అవకాశాలు ఇచ్చే విషయంలో నాని ముందువరసలో ఉంటారు. నాని తర్వాత సినిమాలతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus