Bheemla Nayak: పవన్ సినిమాతో క్రేజ్ పెరుగుతుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘భీమ్లా నాయక్’. ఇప్పుడు జనాల్లో ఈ సినిమాకి క్రేజ్ మాములుగా లేదు. నిన్న విడుదలైన సినిమా టైటిల్ అనౌన్స్మెంట్, వీడియో గ్లిమ్ప్స్ తో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ట్రేడ్ లో కూడా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ఈ సినిమాలో నటిస్తున్న ఇతర తారలకు కూడా క్రేజ్ పెరిగే అవకాశాలున్నాయి.

ఈ సినిమాలో పవన్ కి జోడీగా నిత్యామీనన్ కనిపించనుంది. ఆమె పవన్ తో కలిసి నటించడం ఇదే మొదటిసారి. నిత్యా కాస్త బొద్దుగా ఉండడంతో అవకాశాలు బాగా తగ్గాయి. ఇక ఈ మధ్యకాలంలో ఆమె బాగా లావు అవ్వడంతో హీరోయిన్ గా అవకాశాలు ఇవ్వడానికి దర్శకనిర్మాతలు రెండేళ్లుగా వెనుకడుగు వేస్తున్నారు. కానీ ‘భీమ్లా నాయక్’ సినిమాలో హీరోయిన్ రోల్ రెగ్యులర్ గా ఉండదు. అందుకే ఆ ఛాన్స్ నిత్యామీనన్ కూడా దక్కింది.

మరి ఈ సినిమా కోసమో లేక మరో కారణమో తెలియదు కానీ ఆమె కాస్త బరువు తగ్గినట్లుగా కనిపిస్తుంది. ‘భీమ్లా నాయక్’ గనుక అంచనాలు అందుకొని భారీ బ్లాక్ బస్టర్ అయితే నిత్యామీనన్ క్రేజ్ మళ్లీ పెరుగుతుంది. నిత్య కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. తెలుగులో ఈ బ్యూటీ అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించినా.. స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus