‘బిగ్ బాస్4’ : మళ్లీ రీ ఎంట్రీ ఉంటుందా..?

బిగ్ బాస్ హౌస్ నుంచి నోయల్ అనూహ్యంగా బయటకి వచ్చేశాడు. విపరీతమైన లెగ్ పైయిన్, షోల్డర్ పైయిన్ భరించలేకపోయాడు. రాత్రిళ్లు నిద్రకూడా పోలేదు. నిజానికి బిబి డే కేర్ టాస్క్ లో చాలా ఇబ్బంది పడ్డాడు. అంతేకాదు, నోయల్ తర్వాత ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. అనారోగ్యంగా ఉన్న నోయల్ ని మెడికల్ రూమ్ లోకి పంపించిన తర్వాత డాక్టర్స్ ఇంకా మెరుగైన వైద్యం కావాలని సూచించారు. దీంతో చేసేది ఏమీ లేక నోయల్ ని బిగ్ బాస్ ట్రీట్మెంట్ కోసం బయటకి పంపించేయాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు హాస్పిటల్ లో ఉంచుతూ నోయల్ కి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత తిరిగి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

మిస్టర్ కూల్ గా ఉన్న నోయల్ ఇలా అనూహ్యంగా బయటకి రావడం అనేది నోయల్ ఫ్యాన్స్ ని విపరీతంగా బాధపెట్టింది. అంతేకాదు, మిగతా హౌస్ మేట్స్ కూడా చాలా బాధపడ్డారు. హారిక అయితే వెక్కివెక్కి ఏడ్చింది కూడా. నోయల్ కి ఆర్థరైటిస్ లక్షణాలు కనిపిస్తున్నాయని సమాచారం. ఆర్ధరైటీస్ వస్తే అడుగు తీసి అడుగు వేయ‌డ‌ం కష్టంగా మారుతుంది. అంతేకాదు, ఇలాంటి తరహా అనారోగ్యాలకి విశ్రాంతి తీస్కోవడమే మెడిసిన్ లాంటింది. కాబట్టి నోయల్ కి కనీసం ఐదు – ఆరు వారాలు విశ్రాంతి తీస్కోమని డాక్టర్స్ సలహా ఇచ్చే అవకాశం ఉంది.

అందుకే, మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి ఇక రాకపోవచ్చనే సమాచారం. ఎందుకంటే, ఇప్పటికే 9వ వారంలోకి బిగ్ బాస్ షో వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మరో రెండు మూడు వారాలు ఆగి నోయల్ వచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదు. అంతేకాదు, అప్పటికీ పూర్తి ఫిట్ నెస్ సాధిస్తాడని నమ్మకం కూడా లేదు. అందుకే, నోయల్ గేమ్ ఇక్కడితో ఓవర్ అయినట్లే అని చెప్పొచ్చు. ఇక సోషల్ మీడియాలో నోయల్ ని హౌస్ లో మిస్ అవుతున్నామని ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్థిస్తున్నారు. అదీ విషయం.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus