Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’పై క్రేజీ రూమర్‌… నిజమైతే ఫ్యాన్స్‌కి పండగే!

ఎప్పుడో జరిగిన కథను ఇప్పుడు సినిమాగా చూపించడం ఒక హిట్‌ ఫార్ములా అని చెప్పొచ్చు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇలాంటి సినిమాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటి లుక్‌ అండ్‌ ఫీల్‌ కాకుండా కాస్త వెనక్కి వెళ్లి సినిమాలు చేయడం దీని కాన్సెప్ట్‌. సులభంగా చెప్పాలంటే 80ల నాటి, 90ల నాటి అని అంటుంటారు కదా. అలా అన్నమాట. ఈ కోవలోకి తాజాగా మరో సినిమా వెళ్లింది అంటున్నారు. అదే ‘ఓజీ’. అవును పవన్‌ కల్యాణ్‌ – సుజీత్‌ సినిమా ప్రజెంట్‌ కథతో కాకుండా వెనకటి కథ అని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ప్రస్తుతం మోస్ట్‌ హ్యాపీ మూడ్‌లో ఉన్నారు అని చెప్పొచ్చు. దానికి కారణం పవన్‌ వరుసగా సినిమాలు చేస్తుండటమే… ఇటు రాజకీయాలు, అటు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి జోష్‌ ‘ఓజీ’ సినిమా కూడా ఉండటం డబుల్ కిక్‌ను ఇస్తోంది. ఎందుకంటే ఆ సినిమా గురించి ఇప్పటివరకు వచ్చిన వార్తలు, పుకార్లు, పోస్టర్లు, అప్‌డేట్లు అదిరిపోయాయి. ఇప్పుడు వాటికి మించి అనేలా ఈ సినిమా నేపథ్యం గురించి తెలిసింది.

అందులో కొత్తేముంది ముంబయి నేపథ్యంలో మార్షల్‌ ఆర్ట్స్‌ బ్యాకప్‌ కదా అంటారా? అవును అదే కథ.. అయితే ఈ సినిమా సుమారు 60 నుంచి 70 ఏళ్ల వెనక జరిగిన అని చెబుతున్నారు. 1950ల ప్రాంతంలో నడిచే కథగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారని ఓ టాక్‌ నడుస్తోంది. అప్పటి పరిస్థితులను రీక్రియేట్ చేయడం, పవన్‌ ఇమేజ్‌కు తగ్గట్లుగా సినిమాను రూపొందించడం లాంటి క్రిటికల్‌ పనిని సుజీత్‌ తలకెత్తుకున్నాడట.

అయితే మరి సినిమా మొత్తం అదే సమయంలో నడుస్తుందా? లేక కొన్ని సన్నివేశాల కోసం అన్నేళ్లు వెనక్కి వెళ్తారా అనేది చూడాలి. అలాగే ఈ సినిమా కోసం సుజీత్‌ ఇంట్రడక్షన్ సీన్ రాసుకున్నారట. అది కెరీర్ లో ది బెస్ట్ అనిపించుకుంటుంది అని చెబుతున్నారు. ఇప్పటివరకు పవన్ ఇంట్రో సీన్స్ అంటే.. ‘పంజా’, ‘వకీల్ సాబ్’, ‘అజ్ఞాతవాసి’ లాంటి సినిమాల పేర్లు ముందు వినిపిస్తున్నాయి. ఇకపై ‘ఓజీ’ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంటుంది అంటున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus