Prashanth Neel,Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల రిక్వెస్ట్ ను ప్రశాంత్ నీల్ అంగీకరిస్తారా?

  • December 26, 2023 / 03:03 PM IST

జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా 2024 ఏప్రిల్ లో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి. సలార్ సక్సెస్ సాధించడంతో ప్రశాంత్ నీల్ తర్వాత సినిమాల కోసం అభిమానులు ఒకింత ఆసక్తితో ఎదురుచూస్తుండటం గమనార్హం. అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమాను డార్క్ షేడ్స్ లో తెరకెక్కించవద్దని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ ను కోరుతున్నారు.

డార్క్ షేడ్స్ లో సినిమాను తెరకెక్కించడం వల్ల మొనాటనీ వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఓసీడీ వల్ల డార్క్ షేడ్స్ లో సినిమా తీస్తున్నానని వెల్లడించిన నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల రిక్వెస్ట్ ను ప్రశాంత్ నీల్ అంగీకరించే అవకాశాలు అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

దేవర మూవీ విడుదలైన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న తారక్ దేవర సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు ఒక నిర్మాతగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా కమర్షియల్ రేంజ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న తారక్ దేవర సినిమాతో తన మార్కెట్ ను ఏ రేంజ్ లో పెంచుకుంటారో చూడాల్సి ఉంది.

దేవర సక్సెస్ సాధిస్తే తారక్ (Jr NTR) భవిష్యత్తు సినిమాలకు మరింత భారీగా బిజినెస్ జరుగుతుందని చెప్పవచ్చు. దేవర మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. దేవర సినిమా కథ గురించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus