పూరి జగన్నాథ్ కి చరణ్ ఏమని సలహా ఇచ్చారు?

  • February 1, 2018 / 12:54 PM IST

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తెరంగ్రేటం చేశారు. తొలి సినిమా చిరుతతోనే అటు మాస్ ప్రేక్షకులకు, ఇటు క్లాస్ ప్రేక్షకులకు చెర్రీ నచ్చేలా పూరి చూపించారు. ఆ తర్వాత ఇద్దరి కలయికలో మూవీ రాలేదు. ఇద్దరూ తమ తమ ప్రాజక్ట్స్ లో బిజీ కావడంతో కుదరలేదు. పైగా మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా కథ విషయంలో వచ్చిన మిస్ అండర్ స్టాండింగ్ వల్ల కొంత దూరం పెరిగింది. అయితే ఆ గొడవలను పక్కన పెట్టి పూరి జగన్నాథ్ రీసెంట్ గా రామ్ చరణ్ ని కలిసి కథ చెప్పారంటా. ఆ కథ చెర్రీకి నచ్చలేదని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఇదే విషయాన్నీ పూరికి డైరక్ట్ గా చెప్పేసారు. “మీ దర్శకత్వంలో నటించాలంటే నాకూ ఇష్టమే. అయితే ఇతరులు రాసిన మంచి కథ ఉంటె తీసుకు రండి సినిమా చేద్దాం” అని చెప్పినట్లు టాక్.

ఇది తెలిసి చరణ్ మంచి మాట చెప్పారని సినీ విశ్లేషకులు అభినందిస్తున్నారు. ఎందుకంటే పూరి చాలా చక్కగా కథలు రాయగలరని అతని గత చిత్రాలు చెబుతున్నాయి. కానీ కొన్నేళ్లుగా అతని సొంత కథలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. గత ఐదేళ్ళలో టెంపర్ ఒక్కటే హిట్ సాధించింది. దానికి కథ వక్కంతం వంశీ ఇచ్చాడు. తన ఎఫెక్ట్ మొత్తం డైరక్షన్ పై పెట్టడంతో హిట్ అందుకున్నారు. సో అలాగే బయటికథతో డైరక్షన్ చేస్తే చెర్రీ  డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి చరణ్ సలహాని పూరి జగన్నాథ్ పాటిస్తారా? అనేది ఇక్కడ సస్పెన్స్ గా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus