‘పుష్ప 2’ సినిమా విడుదలవుతుంది అనడానికి కొన్ని రోజుల ముందు నుండే ‘పుష్ప 3’ సినిమా ఉంటుంది అని సినిమా టీమ్ నుండి లీక్‌లు వచ్చాయి. ఒకట్రెండు రోజుల ముందు సినిమా టీమ్ నుండి వచ్చిన ఓ ఫొటోలో వెను ‘పుష్ప: ది ర్యాంపేజ్’ అనే పోస్టర్ కూడా కనిపించింది. అయితే ‘పుష్ప 2’ సినిమా వచ్చాక.. మూడో ‘పుష్ప’ గురించి ఎవరూ పెద్దగా మాట్లాడలేదు.
దీంతో చాలా రోజులు గ్యాప్ వస్తుందేమో అనుకున్నారంతా. అలా అలా అది మూడోసారి ‘పుష్ప’రాజ్ వస్తాడా? లేదా? అనే డౌట్‌కి దారి తీసింది. ఇప్పుడు సైమా అవార్డుల వేదికగా దర్శకుడు సుకుమార్ ‘పుష్ప 3’ గురించి మాట్లాడారు. కచ్చితంగా మూడోసారి ‘పుష్ప’రాజ్ వస్తాడు అని క్లారిటీ ఇచ్చారు. అయితే అసలు అవకాశం ఉందా? ఉంటే ఎన్నేళ్లలో ఆ సినిమా రావొచ్చు. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేదే ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే అల్లు అర్జున్ ప్రస్తుతం ఓకే చేసిన అట్లీ సినిమా షూటింగ్ పూర్తయి విడుదలయ్యే సరికి 2027 వచ్చేస్తుందని సమాచారం.
పుకార్లు నిజమైతే ఈ సినిమా రెండు భాగాల్లో తెరకెక్కుతుంది. ఆ రెండో భాగం రావాలంటే కచ్చితంగా 2029 అవుతుంది. అంటే అల్లు అర్జున్ మళ్లీ ‘పుష్ప’రాజ్ అవ్వడానికి కనీసం నాలుగేళ్లు అవుతుంది. ఇవన్నీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలు అనుకున్నట్లుగా ముందుకెళ్తేనే. ఒకవేళ అట్లీ సినిమా ఒక పార్టే అయితే బన్నీ 2027లో ఖాళీ అవుతాడు. అప్పటికి సుకుమార్.. రామ్‌చరణ్ సినిమా పనుల్లో బిజీగా ఉంటారు.
ఆయన ఖాళీ అయ్యేసరికి 2028 వచ్చేస్తుంది. ఆ లెక్కన ఒక ఏడాది తగ్గుతుంది. అలా ఏదైనా కనీసం మూడేళ్లు పడుతుంది. తిరిగి బన్నీ, సుకుమార్ ‘పుష్ప’రాజ్ మూడ్‌లోకి రావడానికి. అంత లేట్ అయినా సినిమాలో లేటెస్ట్ మజా ఉంటుంది కాబట్టి జనాలు అయితే చూస్తారు. మరి నిజంగానే ‘పుష్ప’రాజ్ వస్తాడా? వస్తే ఇప్పటిలా అలరిస్తాడా అనేది చూడాలి.