Raashi Khanna: రాశీ ఖన్నా ఆశలు భారీగానే ఉన్నాయిగా… కానీ రియాలిటీలో ఆ పరిస్థితి ఉందా?

దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగి మెల్లగా సినిమాలు తగ్గిపోయిన హీరోయిన్లను చూసుంటారు. అలా కాకుండా ఉన్నపళంగా సినిమాలు తగ్గిపోయిన భామల లిస్ట్‌ రాస్తే టాప్‌లో కనిపించే పేరు రాశీ ఖన్నా (Raashii Khanna) . అవును రెండు, మూడేళ్ల క్రితం వరకు వరుస సినిమాలు చేసిన ఆమె ఇప్పుడు తెలుగులో సినిమాలే చేయడం లేదు. అలా అని ఫిగర్‌ అవుట్‌ అయిపోయి సైడ్‌ అయిపోయిందా అంటే లేదనే చెప్పాలి. ఒకప్పటి కంటే స్లిమ్‌గా, అందంగా, కాస్త హాట్‌నెస్‌ పెంచుకుని మరీ అదరగొడుతోంది. అయితే తెలుగులో మాత్రం అవకాశం రావడం లేదు. అయితే హిందీలో సిరీస్‌లతో దూకుడు చూపిస్తోంది.

దక్షిణాదితోపాటు, బాలీవుడ్‌లోనూ సినిమాలు చేసి సినీప్రియుల్ని మెప్పించింది రాశీ ఖన్నా. ఇటీవలే ఆమె చేసిన హిందీ సినిమాలో ‘యోధ’ విడుదలై విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆమె కెరీర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవి చూస్తుంటే… ఆశలు ఆకాశాన్ని అంటుతుంటే… రియాలిటీలో మాత్రం ఆ పరిస్థితి లేదు అని చెప్పొచ్చు. కావాలంటే మీరే చూడండి సరైన సినిమాలు లేక ఆలోచిస్తున్న ఆమె… ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీతో కలిసి పనిచేయాలని ఉందని అంటోంది.

సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించాలనేది నా కల. ఎన్నో ఏళ్లుగా ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. నేనే కాదు నటీనటులు అందరూ ఇలానే అనుకుంటారు. ఆయన సినిమాల్లో స్త్రీలను చూపించే విధానం అంత బాగుంటుంది. విమర్శకుల్ని మంత్రముగ్ధుల్ని చేయగల దర్శకుడు ఆయన. అందుకే భన్సాలీతో పని చేసే రోజు కోసం ఎదురుచూస్తున్నాను. అలాగే కరణ్‌ జోహార్‌తో (Karan Johar) కూడా పని చేయాలని ఉందని చెప్పింది రాశీ ఖన్నా.

కొన్ని నెలల క్రితం ‘ఫర్జీ’తో అలరించిన రాశీ ఖన్నా… ‘ఫర్జీ 2’తో త్వరలో పలకరించనుంది. వచ్చే ఏడాది నుండి షూటింగ్‌ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఆమె నటించిన మరో బాలీవుడ్‌ సినిమా ‘ది సబర్మతీ రిపోర్ట్‌’ రెడీగా ఉంది. గోద్రా రైలును తగలబెట్టడం వెనక దాగి ఉన్న రహస్యాలను ఈ సినిమాలో చూపిస్తారు. మే 3న ఈ సినిమా రిలీజ్‌ చేస్తారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus