Rajamouli, Jai Hanuman: జై హనుమాన్ లో మహేష్ నటించడానికి జక్కన్న గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

తక్కువ సినిమాలే డైరెక్ట్ చేసినా ప్రస్తుతం ప్రశాంత్ వర్మ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది. హనుమాన్ మూవీ సక్సెస్ తో ప్రశాంత్ వర్మ స్టార్ డైరెక్టర్ల రేసులో చేరినట్టేనని చెప్పవచ్చు. ప్రశాంత్ వర్మ పారితోషికం కూడా భారీ రేంజ్ లో ఉంది. తెలుగుతో పాటు హిందీ నుంచి సైతం ప్రశాంత్ వర్మకు మూవీ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రశాంత్ వర్మ రేంజ్ రోవర్ హై ఎండ్ వెర్షన్ కారును కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

ప్రశాంత్ వర్మ తాజాగా జై హనుమాన్ లో హనుమాన్ రోల్ లో చిరంజీవి రాముని పాత్రలో మహేష్ బాబు నటిస్తే బాగుంటుందని కామెంట్లు చేశారు. అయితే కృష్ణ తన సినీ కెరీర్ లో రాముని పాత్రను ఎప్పుడూ ట్రై చేయలేదు. శ్రీరాముని రోల్ లో నటించి ప్రేక్షకులను మెప్పించడం సులువైన విషయం కాదు. మహేష్ బాబు శ్రీరాముని పాత్రలో నటించడానికి అంగీకరిస్తారో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు మహేష్ ప్రస్తుతం జక్కన్న డైరెక్షన్ లో నటిస్తున్నారు.

జక్కన్న (Rajamouli) తన సినిమాలో నటించే హీరో సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు. జై హనుమాన్ లో శ్రీరాముని పాత్ర నిడివి కేవలం 15 నిమిషాలు మాత్రమేనని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మహేష్ బాబు ఏం చేస్తారో చూడాల్సి ఉంది. మహేష్ పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. అయితే జై హనుమాన్ లో నిడివి తక్కువ కావడంతో మహేష్ తక్కువ రెమ్యునరేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది.

మహేష్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మహేష్ 30వ సినిమాగా ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. రాబోయే రోజుల్లో మహేష్ బాబు కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. మహేష్ రాజమౌళి సినిమా తర్వాత వేగంగా సినిమల్లో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. యావరేజ్ టాక్ తో సైతం బ్లాక్ బస్టర్ హిట్లు సాధించేలా మహేష్ బాబు కెరీర్ ప్లానింగ్ ఉంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus