ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమాలలో ఆర్ఆర్ఆర్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. వెండితెరపై, ఓటీటీలో, బుల్లితెరపై సక్సెస్ సాధించిన ఈ సినిమాలోని స్క్రీన్ ప్లేకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చరణ్, తారక్ ఈ సినిమాలో కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించారు. ఆర్ఆర్ఆర్ మూవీ త్వరలో జపాన్ లో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. రాజమౌళి, చరణ్, తారక్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఈ సినిమాకు క్రేజ్ మరింత పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే ఆర్ఆర్ఆర్ మూవీ ఒక రికార్డును బ్రేక్ చేస్తుందా? లేదా? అనే చర్చ అభిమానుల మధ్య జరుగుతుండటం గమనార్హం. రజనీకాంత్ కు జపాన్ లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. రజనీకాంత్ నటించిన సినిమాలు అక్కడ సంచలన విజయాలను సొంతం చేసుకుని ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. రజనీకాంత్ నటించిన ముత్తు సినిమా అప్పట్లోనే 20 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ మూవీ ఈ రికార్డును బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ రికార్డ్ బ్రేక్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.
జపాన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కూడా ఊహించని రేంజ్ లో క్రేజ్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు జపాన్ లో కూడా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం రికార్డులు బ్రేక్ కావాల్సిందేనని చెప్పవచ్చు. ఇతర దేశాల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో ఫుల్ రన్ కలెక్షన్లు ఊహించని స్థాయిలో పెరుగుతాయని నెటిజన్లు భావిస్తున్నారు. రాజమౌళికి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇతర దేశాల్లో కూడా ఊహించని స్థాయిలో గుర్తింపు దక్కింది.
ఆర్ఆర్ఆర్ సినిమా జక్కన్న క్రేజ్ ను మరింత పెంచడంతో పాటు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. రాజమౌళి తర్వాత సినిమాలు సైతం భారీ బడ్జెట్ తో జరుగుతున్నాయి. జక్కన్న తర్వాత సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. 700 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!