RRR, KGF2: అలా జరిగితే కేజీఎఫ్2 మూవీకి నష్టమేనా?

కొన్ని వారాల గ్యాప్ లో రెండు పెద్ద సినిమాలు విడుదలైతే ఒక సినిమా కలెక్షన్లు మరో సినిమాపై ప్రభావం చూపుతాయనే సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా గత నెలలోనే విడుదలై అంచనాలను మించి విజయం సాధించి చరణ్, తారక్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ద్వారా చరణ్, తారక్ ఖాతాలో అరుదైన రికార్డులు చేరాయి. థర్డ్ వీకెండ్ లో కూడా ఈ సినిమా అంచనాలను మించి కలెక్షన్లను సాధించింది.

అయితే తెలుగు రాష్ట్రాల వరకు ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ కేజీఎఫ్2 పై ఉంటుందని తెలుస్తోంది. గత శుక్రవారం విడుదలైన గని మూవీకి ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ వల్ల ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. గని మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు 5 కోట్ల రూపాయల లోపే ఉన్నాయంటే ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ ఈ సినిమాపై ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాను మించి హిట్ టాక్ వస్తే మాత్రమే కేజీఎఫ్2 తెలుగు రాష్ట్రాల వరకు హిట్ అనిపించుకుంటుంది.

కేజీఎఫ్2 సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగా బీస్ట్ సినిమాపై ఈ సినిమానే పై చేయి సాధిస్తుండటం గమనార్హం. రికార్డు స్థాయి రేట్లకు కేజీఎఫ్2 హక్కులు అమ్ముడవగా 2 గంటల 48 నిమిషాల నిడివితో ఈ సినిమా రిలీజ్ కానుంది. క్లైమాక్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవనుందని తెలుస్తోంది. కేజీఎఫ్2 బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కేజీఎఫ్2 టీమ్ ఈ సినిమా ప్రమోషన్లలో వేగం పెంచి ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ ను దాటుకుని కేజీఎఫ్2 ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది. కేజీఎఫ్2 ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేపోయినా సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి. ఊహించని ట్విస్టులు ఈ సినిమాలో ఉండబోతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. కేజీఎఫ్2 రిలీజైన తర్వాత కూడా ఆర్ఆర్ఆర్ హవా కొనసాగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus