Salaar: కేజీఎఫ్2 రికార్డులను సలార్ టీజర్ బ్రేక్ చేయడం సాధ్యమేనా?

  • July 4, 2023 / 07:55 PM IST

గతేడాది బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో సంచలనాలు సృష్టించిన సినిమాల జాబితాలో కేజీఎఫ్2 ఒకటి. యశ్, ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేశారు. 1200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లతో ఈ సినిమా సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు. కేజీఎఫ్2 తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ మూవీ తెరకెక్కుతుండగా ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ నెల 28వ తేదీన రిలీజ్ కానుంది.

ఈ నెల 6వ తేదీన ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుందనే సంగతి తెలిసిందే. అయితే కేజీఎఫ్2 సినిమాలో హీరోను నావీ అధికారులు ఎటాక్ చేసే సమయం, సలార్ మూవీ టీజర్ రిలీజ్ టైం ఒకే విధంగా ఉండటంతో ఈ లింక్ గురించి తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు కేజీఎఫ్2 టీజర్, ట్రైలర్లు రిలీజ్ సమయంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం జరిగింది.

సలార్ (Salaar) సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడలేదని సలార్ సినిమాలోని సీన్లకు గూస్ బంప్స్ రావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సలార్ తెలుగు రాష్ట్రాల హక్కులు 180 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడవుతున్నాయని సమాచారం. ప్రభాస్ గత సినిమాల ప్రభావం ఈ సినిమాపై ఏ మాత్రం పడలేదని తెలుస్తోంది. ప్రభాస్ మాస్ రోల్స్ కు ఎంతగానో ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభాస్ లుక్ కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. సలార్ టీజర్ యూట్యూబ్ ను షేక్ చేసే విధంగా ఉంటుందని భోగట్టా. సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానున్నాయి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus